సోషల్ మీడియా ద్వారా ఎవరైనా పరిచయం అయితే వారితో అక్కడివరకే ఉండాలి. ఎందుకుంటే.. ఆ గీత దాటితే ఇటు అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతి.. తన ప్రాణాలనే హరిస్తుందని ఆ యువకుడికి తెలియదు. క్షణికావేశంలో.. పర్యవసానాల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా చేసే నేరాలతో యావత్ జీవితం జైలు గోడల మధ్యే గడపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అచ్చంగా బాగ్ అంబర్ పేటకు చెందిన యశ్మకుమార్ విషయంలో అదే జరిగింది.
యశ్మ కుమార్ తో సోషల్ మీడియా వేదికగా పరిచయం అయిన మీర్ పేట్‌కు చెందిన వివాహిత శ్వేతారెడ్డి జైలు జీవితానికి కారణమైంది. ఓ వైపు తనకు వివాహం అయ్యిందన్న విషయాన్ని కూడా మర్చిపోయిన శ్వేత.. తన సోషల్ మీడియా ఫ్రెండ్ ను తనకు పరిచయమున్న మరో స్నేహితుడితో హత్య చేయించింది. అయితే తనకేం తెలియందన్నట్లు అమాయకత్వాన్ని నటించింది. యశ్మ కుమార్‌ను ప్రశాంతి హిల్స్‌లోని ఓ ప్రాంతానికి రప్పించి హత్య చేయించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. యశ్మ కుమార్‌ను ఈ నెల 5వ తేదీన రాత్రి 12:43 గంటలకు హత్య చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. యశ్మ కుమార్ తన బైక్‌పై వచ్చి ప్రశాంతి హిల్స్‌లో ఆపాడు.
అప్పటికే అక్కడ మాటు వేసిన అశోక్ అనే యువకుడు యశ్మ కుమార్‌తో మాటలు కలిపి.. తల వెనుక భాగంలో సుత్తితో బలంగా బాదాడు. దీంతో యశ్మ కిందపడిపోయాడు. మరో రెండు, మూడు సార్లు తలపై సుత్తితో మోదాడు. కాసేపు అక్కడే ఉన్న అశోక్.. ఓ ఇద్దరు వ్యక్తులు తమ కారును ఆపి పోలీసులకు ఫోన్ చేస్తుండగా అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. యశ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజీ సహాయంతో పోలీసులు కేసు ఛేదించారు. ఈ కేసులో శ్వేతా రెడ్డితో పాటు అశోక్, కార్తీక్ అనే యువకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ మీర్‌పేటలో ఫేస్బుక్ ప్రియుడ్ని మరో ప్రియుడి చేత శ్వేతారెడ్డి హత్య చేయించిన దృశ్యం.. pic.twitter.com/BuhQK37FBv
— Namasthe Telangana (@ntdailyonline) May 13, 2022
(And get your daily news straight to your inbox)
Jun 23 | కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన... Read more
Jun 23 | హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని... Read more
Jun 23 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య..... Read more
Jun 23 | ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే... Read more
Jun 23 | మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో... Read more