Lion Gambolling with Dog in Gujarat సింహాన్ని తరిమిన శునకం.. గ్రామస్థుల వీడియో వైరల్​

Video of lion gambolling with dog in gujarat shocks villagers

Dog made lion sweat, watch the video, Rajkot lion dog viral video, Video of dog lion in Lodhika, Rajkot lion dog viral video, Rajkot Forest Department, Dog chases Lion, Lion Dog Video Viral, Dog, Lion, Rajkot Lion, Dog chases Lion, Magani village, Lodhika, Rajkot, Gujarat, viral video, Trending video

It was found recently that a lion had come out in Lodhika taluka of Rajkot district, 30 km from Rajkot in Gujarat. A large number of villagers flocked to see the lion. In a shocking video, a black dog was seen running playfully with the lion. The clip has now gone viral on social media.

ITEMVIDEOS: సింహాన్ని తరిమిన శునకం.. గ్రామస్థుల వీడియో వైరల్​

Posted: 05/11/2022 04:06 PM IST
Video of lion gambolling with dog in gujarat shocks villagers

గ్రామసింహాలు ఎంతో విశ్వాసంతో కూడుకున్నవి. వాటిని నమ్మి పూట అన్నం పెట్టిన మనుషులకు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. తమ యజమానుల కోసం అవసరమైతే ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తాయి. గ్రామానికి తామే సింహాలమని భావిస్తున్న ఈ శనకాలు.. అవసరమైతే సింహాలతోనూ కూడా తమ పోలిమేరల్లోకి రానీయకుండా తరుముతాయి. ఔనా.. భలే చెప్పారు కానీ.. ఇక చాలు,. చాలా ఓవర్ అయ్యింది. అని అంటారా. కానీ ఇది నిజమే. ఓ గ్రామసింహం ఏకంగా సింహాన్ని గ్రామంలోనికి రానీయకుండా తరిమేసింది. అడ‌వికి రారాజైన మృగరాజు.. గ్రామంలోకి అడుగుపెట్టాగానే ఓ శున‌కం దానికి చెమ‌ట‌లు ప‌ట్టించింది.

ఏదో సాదాసీదాగా మృగరాజుకు కొంత దూరంగా వుండి అరవడం కాదు.. ఏకంగా ఆ సింహాన్ని వెంబడిస్తూ చుక్క‌లు చూపించింది. శున‌కం దెబ్బ‌కు సింహాం తన కాళ్లకు పనిచెప్పింది. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాజ్‌కోట్‌ జిల్లాలోని లోధికా తాలుకాలోని మాగాణి గ్రామ‌ ప‌రిస‌రాల్లో వెలుగు చూసింది. ఈ గ్రామ సమీపంలో కొద్దిరోజులుగా సింహాలు సంచరిస్తున్నాయి. అయితే సింహాలను ప్రత్యక్షంగా చేసేందుకు కొన్ని జాగ్రత్తలను తీసుకున్న స్థానిక ప్రజలు వాటిని చూసేందుకు వస్తుంటారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు.

వన్యమృగాల నుంచి తమ పంటలను కాపాడేందుకు రైతులు తమ శునకాన్ని కాపలాగా ఉంచారు.  అయితే రెండు రోజుల క్రితం ఆ పంట పొలాల వైపు ఓ సింహాం వ‌చ్చింది. సింహాన్ని చూసిన న‌ల్ల కుక్క ఏ మాత్రం బెద‌ర‌లేదు. పంటపొలాల నుంచి గ్రామం వైపు వ‌స్తున్న సింహాన్ని ఆ శున‌కం వెంటాడింది. ఈ ఘ‌ట‌న‌ను చూసి రైతులు ఆశ్చ‌ర్య‌పోయారు. రైతులు అందించిన స‌మాచారంతో సింహాన్ని చూసేందుకు జ‌నాలు భారీగా త‌ర‌లివ‌చ్చారు. సింహాన్ని గ్రామ స‌రిహ‌ద్దుల నుంచి శున‌కం త‌రిమికొట్టింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog  Lion  Rajkot Lion  Dog chases Lion  Magani village  Lodhika  Rajkot  Gujarat  viral video  Trending video  

Other Articles