బ్రిటీషు కాలం నాటి దేశద్రోహ చట్టం కొనసాగింపుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో తొలుత ఈ చట్టాన్ని కొనసాగించాలని వాదనలు వినిపించిన కేంద్రం తరువాత వెనక్కుతగ్గిన విషయం తెలిసిందే. దేశద్రోహం చట్టంపై పునఃసమీక్షిస్తామని అత్యన్నత న్యాయస్థానంలో తెలిపింది. దీంతో ఇవాళ మరో పర్యాయం ఈ కేసు విషయమై విచారించిన న్యాయస్థానం.. కేంద్రం పునఃసమీక్షించి నిర్ణయం తీసుకునే వరకు దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం అదేశించింది.
ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రసర్కార్ ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 124ఏ చట్టాన్ని సంపూర్ణంగా సమీక్షించనున్నట్లు కోర్టుకు విన్నవించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో పాతకాలం చట్టాలను రద్దు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టాన్ని కూడా రద్దు చేయాలని భావించారు. సెక్షన్ 124ఏ ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అప్పటివరకు కేసులు నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. దేశద్రోహం చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. అదేసమయంలో, దేశద్రోహం చట్టంపై పునఃపరిశీలన ప్రక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దేశద్రోహం చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తోందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more