పరాయి సోమ్ము పాముతో సమానం అనేవాళ్లు మన పూర్వికులు. అంటే అది విషంతో సమానమని.. లేదా ఆ డబ్బును ఆశిస్తే.. అది ఏదో ఒక పూట కాటేస్తుందని అర్థం ఆ మాట వెనుక దాగివుంది. కానీ ఈ కాలంలో ఎన్ని ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నా.. మనిషి అన్నవాడికి స్వార్థం తప్ప.. ఏ కోశాన నీతి, నిజాయితీ అన్నది కనిపించడం లేదు. ధనం మూలమ్ ఇదం జగత్ అన్నట్లు.. యావత్ ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతోంది. అయితే ఇలా పరాయి సొమ్మును ఆశించడం, కాజేయడం పాపమే కాదు నేరం కూడా. ఇలాంటి చర్యలకు ఎవరైన పాల్పడితే.. వారిపై పోలీసులకు పిర్యాదు చేస్తాం.
అయితే పోలీసులే ఇలా పరాయి వ్యక్తుల సోమ్ముకు ఆశపడితే.. ఏం చేస్తాం. ఔనా.. నిజంగానా.. ఉన్నాతాధికారులను ఆశ్రయించడం తప్ప ఏం చేస్తాం. అదే జరిగింది. ఒక వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపబడి జైలుకు వెళ్లాడు. అతను జైలుకు వెళ్లే క్రమంలో అతని నుంచి లభించిన వస్తువులను పోలీసులు తీసుకుని భద్రపర్చారు. అలా భద్రపర్చిన వస్తువుల్లోంచి డెబిట్ కార్డు తీసి.. దాని ద్వారా నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వాడేసుకున్నాడు ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్. ఈ వ్యవహారం ప్రస్తతం సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసులు అంతర్గత విచారణ జరుపుతున్నారు.
అసలేం జరిగిందీ అన్న వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఓ దోంగ పట్టుబడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఈ దొంగ బేగంబజార్ పరిధిలో టైర్లు దొంగిలించి పట్టుబడ్డారు. సదరు నిందితుడు జైల్లో ఉన్నప్పుడు అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇన్స్‌పెక్టర్ రూ. 5 లక్షలు స్వాహా చేశాడు. ఫిబ్రవరిలో చోరీ కేసులో నిందితుడు అగర్వాల్‌ని రాచకొండ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో అగర్వాల్ డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై బయటికి వచ్చాక అకౌంట్ చెక్ చేయగా.. తన ఏటీఎం కార్డు నుంచి భారీ గా నగదు విత్ డ్రా చేసినట్టు గుర్తించాడు.
బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా ఏటీఎం ద్వారా డబ్బు డ్రా అయినట్లు తెలుసుకున్నాడు. దీంతో పోలీసులు సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి పోలీసు కస్టడీలో ఉండగా, అందులోంచి లక్షల రూపాయల డబ్బులు పోయాయంటూ సదరు దొంగ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణ జరిపించారు. ఓ ఇన్స్పెక్టర్ నిందితుడి ఏటీఎం కార్డ్ ద్వారా రూ. 5 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించినట్టు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more