Domestic Lpg Cylinder Price Hiked By Rs 50 మళ్లీ పెరిగిన వంటింటి బండ.. సామాన్యులపై గుదిబండ..!

Lpg price hiked again cooking gas price up by rs 50

lpg, lpg price hike, lpg cylinder price hike, lpg gas cylinder price hike, cooking gas price, lpgy cylinder price today, lpg price today, lpg price delhi, lpg price mumbai, lpg price darbhanga

The liquefied petroleum gas (LPG) price on Saturday was hiked by Rs 50 per cylinder in line with a spike in international energy prices. A 14.2-kg non-subsidised domestic gas cylinder will cost Rs 999.50 per cylinder from today. The hike in cylinder prices has come at a time when people are already troubled by the rising prices of petrol and diesel in the country.

మళ్లీ పెరిగిన వంటింటి బండ.. సామాన్యులపై గుదిబండ..!

Posted: 05/07/2022 11:30 AM IST
Lpg price hiked again cooking gas price up by rs 50

కరోనావైరస్ మహమ్మారి దేశంలోకి ఏ గడియన అడుగుపెట్టిందో తెలియదు కానీ.. 2021లో విధించిన తొలి లాక్ డౌన్ ఎత్తివేసి అన్ లాక్ ప్రవేశపెట్టిన వెంటనే దేశంలో ధరాఘాత సమస్య ఉత్పన్నమయ్యింది. సామాన్య మధ్యతరగలి ప్రజలు అర్థాకలితో జీవితాలను ఈడుస్తూ పేదల జాబితాలోకి కలసిపోయారు. ఇక పేదలు కనీసం రోజుకో పూట అన్నం కోసం అర్థిస్తున్నారు. అంతలా పరిస్థితులు మారిపోతున్న క్రమంలో ప్రజలపై పడుతున్న విపరీత భారాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలు.. దేశ, రాష్ట్రాల అర్థిక పరిస్థితులను పటిష్టపర్చుకునే నేపథ్యంలో వేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సామాన్యులకు శరాఘతంలా పరిణమిస్తున్నాయి,

అందుకు పెరుగుతున్న ఇంధన దరలు, మరీ ముఖ్యంగా డీజిల్ ధరల అన్ని నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం చూపుతోంది. ఇక తాజాగా సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్‌ సిలిండర్‌ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో అగ్గిమీద గుగ్గిలంగా తయారైన మహిళలు.. వంటింట్లోకి వెళ్లగానే మరోమారు కేంద్రప్రభుత్వంపై మండిపడతున్నారు. అందుకు కారణం సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే. అందునా ఒక్కసారిగా రూ. 50 పెంచేసింది. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి.

దీంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1052కి చేరింది. గ్యాస్ సిలిండర్ పై ఇప్పటివరకు లభిస్తున్న రూ.40 సబ్సీడీని కలుకున్నా.. ఏకంగా ఎల్సీజీ సబ్సీడీ సిలిండర్ ధర ఏకంగా రూ. వెయ్య మార్కును దాటింది. గత వారం వ్యవధిలో సిలిండర్‌ బుక్‌ చేసుకున్న కొందరికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం. ఇక నెల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్‌ సిలిండర్‌లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్‌లో పెంపు ప్రకటించలేదు. అటు కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2, 563గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles