Bengaluru startup announces 30-minute official nap time at work ఉద్యోగులకు బంపర్ ఆపర్. అరగంట పాటు అధికారిక నిద్ర..

Bengaluru startup announces 30 minute official nap time at work employees to get quiet rooms

Bengaluru startup announces official nap time, wakefit announces official nap time, Bengaluru startup official nap time, wakefit official nap time, Wakefit co-founder Chaitanya Ramalingegowda e-mail, Bengaluru start-up sleeping at work, wakefit sleeping at work, wakefit, right to nap, sleep at work, wakefit right to nap, wakefit nap time, official nap time, sleep at work, 30 minutes sleep time, bengaluru, viral news

Wouldn't it be a dream come true when your company pays you to sleep at work? A Bengaluru-based startup has announced employees' "right to nap" in an email. Wakefit co-founder Chaitanya Ramalingegowda announced "official nap time" of 30 minutes for its employees.

స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగులకు బంపర్ ఆపర్. అరగంట పాటు అధికారిక నిద్ర..

Posted: 05/06/2022 07:12 PM IST
Bengaluru startup announces 30 minute official nap time at work employees to get quiet rooms

ఉద్యోగులంటే చాలా కంపెనీలకు చిన్న‌చూపే. ఎప్పుడూ వారితో ప‌నిచేయించుకోవాల‌ని చూస్తుంటాయి. అల‌సిపోయి ప‌నివేళ‌లో ఓ కునుకు తీస్తే ఇక అంతే. బాస్ పిలిచి చీవాట్లు పెడుతుంటాడు. అయితే, బెంగ‌ళూరుకు చెందిన ఓ స్టార్ట‌ప్ కంపెనీ ఉద్యోగులకు అనుకూలంగా ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. మ‌ధ్యాహ్నంపూట ఓ అర‌గంట కునుకు తీసేలా అనుమ‌తిచ్చింది. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు మెయిల్స్ కూడా పంపింది.

వేక్‌ఫిట్ అనే ప‌రుపుల త‌యారీ కంపెనీ ఈ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. తాము ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నా ఉద్యోగుల అవ‌స‌రాన్ని గుర్తించ‌లేక‌పోయామ‌ని, అందుకే ఇప్పుడు ఉద్యోగుల‌కు ప‌నివేళ మ‌ధ్య‌లో ఓ కునుకు తీసే అవ‌కాశ‌మిస్తున్నామ‌ని కంపెనీ కో ఫౌండ‌ర్ చైత‌న్య రామ‌లింగెగౌడ అంటున్నారు. ప‌నిమ‌ధ్య‌లో 26 నిమిషాలపాటు కునుకు తీస్తే ప‌నిచేసే సామ‌ర్థ్యం 33 శాతం పెరుగుతుంద‌ని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, నాసా అధ్య‌య‌నంలో తేలింద‌న్నారు.

ఇందుకనుగుణంగానే త‌మ ఉద్యోగుల సామ‌ర్థ్యం పెంచేందుకు ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల ఉంచి 2.30 గంట‌ల‌కు వ‌ర‌కు నిద్ర‌పోయే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు రామ‌లింగెగౌడ తెలిపారు. ఈ స‌మ‌యంలో ఉద్యోగుల‌కు ఎలాంటి ప‌ని చెప్ప‌బోమ‌న్నారు. కాగా, వేక్‌ఫిట్ తీసుకున్న నిర్ణ‌యంపై నెటిజ‌న్ల‌నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. మార్కెట్లో కొత్త ట్రెండ్ సెట్ చేయ‌బోతున్నారంటూ వేక్‌ఫిట్ యాజ‌మాన్యాన్ని అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles