Woman SI Arrests Fiancé on Fraud Charges కాబోయే భర్తను కటకటాల వెనక్కి నెట్టిన మహిళా ఎస్ఐ.!

Months ahead of marriage woman si arrests fiance on fraud charges

lady sub-inspector arrests fiance, SI Junmoni Rabha, fiancé Rana Pogag, Fraud Charges, Public Relation Officer, OIL Limited, duped many for crores of rupees, Majuli, fake seals, false documents, Nagaon District, Assam, Crime

Months before their marriage, Assam lady sub-inspector Junmoni Rabha arrested her fiancé Rana Pogag on fraud charges. Allegedly Junmoni’s fiancé Rana faked his identity as a PR officer of Oil India Limited who duped many people for crores of rupees on the false pretext of providing jobs at OIL India Limited.

కాబోయే భర్తను కటకటాల వెనక్కి నెట్టిన మహిళా ఎస్ఐ.!

Posted: 05/06/2022 01:52 PM IST
Months ahead of marriage woman si arrests fiance on fraud charges

కాబోయే భర్త.. త్వరలో వివాహం కూడా జరగబోతోంది. అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా పూర్తైంది. అతను అమెతో తరచూ మాట్లాడటంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. అయితే ఇదే సమయంలో అమెకు తనకు కాబోయే భర్త గురించి ముగ్గురు యువకులు చెడుగా చెప్పారు. తనకు కాబోయే భర్తపై ఇంత చెడుగా చెప్పడం వల్ల వారికేం లాభం.. వారి మాటలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న అన్న కోణంలో అమె అలోచన చేసింది. అంతే అమెకు తన కాబోయే భర్తపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ అతడికి వ్వతిరేకంగానే ఉన్నాయి. దీంతో కాబోయే భర్త అని కూడా ఉపేక్షించకుండా అమె అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది.

మాయమాటలతో అనేకమందిని బురిడీ కోట్టించి విలాసంగా తిరుగుతూ.. మహిళా ఎస్ఐని కూడా మోసం చేయబోయిన వంచకుడిని శ్రీకృష్ణజన్మస్థానికి పంపింది. ఈ ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ జున్మోని రాభాకు, రానా పోగాగ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా పరిచయం చేసుకున్న అతడితో గత ఏడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నవంబర్‌లో వారిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. అయితే కాబోయే భర్త మోసగాడన్న సంగతి ఎస్‌ఐ జున్మోనికి ఆ తర్వాత తెలిసింది. ఓఎన్‌జీసీలో పని చేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రానా, పలువురిని మోసగించి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు.

ఈ విషయం ఆ పోలీస్‌ అధికారిణి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్తపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు రానా పోగాగ్‌ను గురువారం అరెస్ట్‌ చేశారు. మరోవైపు తన కళ్లు తెరిపించిన ముగ్గురు వ్యక్తులకు ఎస్‌ఐ జున్మోని రాభా ధన్యవాదాలు తెలిపారు. తనకు కాబోయే భర్త రానా పోగాగ్‌ పెద్ద మెసగాడన్న సంగతిని వారు చెప్పారని మీడియాతో ఆమె అన్నారు. కాగా, ఈ పోలీస్‌ అధికారిణి ఈ ఏడాది జనవరిలో వార్తల్లో నిలిచారు. బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పిలుపు మేరకు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన బీజేపీ నేతలకు మద్దతు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles