woman wins £10k per month National lottery for next 30 Years అదృష్టమంటే ఇదేరా.. ముఫై ఏళ్ల పాటు ప్రతి నెల రూ.9.6 లక్షలు

Logistic firm worker wins 10k per month national lottery for next 30 years

Woman wins big, Laura Hoyle logistic firm worker wins set for life, lottery, Rs 9,6 lakh a month for 30 years, Woman lottery win reaction, Set for Life lottery, £10,000 per month lottery, next 30 years, Set For Life scheme, corona lock down, 5 main numbers, plus the Life Ball, top prize

A logistic firm worker named Laura Hoyle, 40, working for a logistics firm won a £10,000 per month lottery that will be disbursed for the next 30 years on monthly basis. A clip released by National Lottery shows us the reaction of the middle aged lady surprised to win the top prize under the Set For Life scheme and couldn’t believe her luck. She purchased the lottery during corona lock down last year and managed to match all the 5 main numbers plus the Life Ball to win the top prize.

అదృష్టమంటే ఇదేరా.. ముఫై ఏళ్ల పాటు ప్రతి నెల రూ.9.6 లక్షలు

Posted: 05/06/2022 03:46 PM IST
Logistic firm worker wins 10k per month national lottery for next 30 years

లాటరీలో ఒక్కేసారి పెద్ద మొత్తం గెలిస్తే ఎవరికైనా జీవితమే మారిపోతుంది. అప్పటివరకు తమలో మాత్రమే ఉన్న ఆశలన్నీ రెక్కలు తోడుక్కుని వాస్తవ రూపం దాల్చేందుకు తోడ్పడాతాయి. ఇక అదే అదృష్టం మరో రూపంలో తలుపుతడితే.. అదెలా అంటే.. ప్రతీ నెల తాము ఊహించనంత డబ్బు ఎలాంటి పని చేయకుండా ఏకంగా మూడు దశాబ్దాల పాటు అందేలా ఉండే లాటరీ టికెట్ తగిలితే.. మొత్తం కలిపితే ఏకంగా 34 కోట్ల రూపాయల జాక్ పాట్. ప్రతీ నెల లభిస్తే అంతకన్నా అదృష్టమా.? అని అంటారు కదూ. అయితే తాజాగా ఈ రెండో రకం అదృష్టం ఒక మహిళను వెతుక్కుంటూ వచ్చి తగింలింది. అయితే ఈ లాటకీ టికెట్ అమె గెలుపోందిందని విషయాన్ని అమె నమ్మడానికి చాలా సమయం పట్టింది.

టికెట్ గెలుపోందారన్న సమాచారం అందగానే ఆమె స్పందించిన తీరు.. అమె ఎదుర్కోన్న అనుభవం.. అమె ప్రదర్శించిన హావభావాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన లారా హోయెల్ అనే మహిళ గత సంవత్సరం మార్చిలో కేమ్ లాట్ అనే ప్రాంతానికి వెళ్లిన సందర్భంగా అమె అక్కడి నుండి సెట్ ఫర్ లైఫ్ అనే లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.అయితే దాదాపుగా 14 నెలల తరువాత విడుదలైన లాటరీ డ్రాలో ఏదైనా చిన్నచితక ప్రైజ్ రాకపోదా అని కొనింది. కానీ అమెకు అదృష్టం రాసిపెట్టి ఉంది. సెట్ ఫర్ లైఫ్ అనే టాటరీలో అమెకు ఏకంగా టాప్ ప్రైజ్‌ లభించింది. ఈ ప్రైజ్ ద్వారా ఏకంగా లక్కి డ్రా విన్నైన నెల నుంచి 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా £10,000 (రూ. 9.55 లక్షలు) అమెకు లభించనున్నాయి.

ఆమె తన భాగస్వామి కిర్క్ స్టీవెన్స్‌తో కలిసి బహుమతిని అందుకుంది. అయితే ఏదో చిన్న ప్రైజ్ తగులుతుందని భావించిన అమెకు.. జీవితాలను మార్చేవిధంగా లాటరీ తగలడంతో.. వారు అంతపెద్ద ప్రైజ్ గెలిచామన్న హావభావాలు కనిపించనీయలేదు. వారు ప్రైజ్ ను అందుకున్నప్పటికీ. ఇంకా ఇది తమకు నమ్మశక్యంగా లేదనే అంటున్నారు. లారా తనకు లాటరీలో తక్కువ మొత్తం మాత్రమే వచ్చిందని అనుకున్నారు. కానీ ఆమె తన ఈ మెయిల్ అకౌంట్ ను ఓపెన్ చేసి.. నేషనల్ లాటరీ నుండి వచ్చిన సందేశాన్ని చూసినప్పుడు, ఆమెకు నమ్మకం కలగలేదు.

"నా టికెట్ గురించి శుభవార్త ఉంది అని డ్రా ముగిసిన వెంటనే నాకు అలర్ట్ వచ్చింది, కానీ నేను ఫైవ్‌లో గెలిచానని ఊహిస్తున్నాను. నేషనల్ లాటరీ అభ్యర్థిస్తూ నాకు ఇమెయిల్ రాకముందే మరిన్ని సెట్ ఫర్ లైఫ్ డ్రాల కోసం ఆడుతూనే ఉన్నాను. నేను నా ఖాతాలోకి లాగిన్ అయ్యాను మరియు నా సందేశాలను తనిఖీ చేస్తాను" అని లారా చెప్పారు. కేమ్‌లాట్‌లో ఖరీదు చేసిన లాటరీతో తన జీవితమే మారిపోతుందని ముమ్మాటికీ భావించలేదని అమె తెలిపింది. అయితే అమె సెట్ ఫర్ లైఫ్ లాటరీ టికె్ట్ ను గెలుచుకుందని ఆ తరువాత వచ్చిన ఫోన్ కాల్ నిర్థారించిందని అమె గుర్తుచేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Lottery  winner  Set for Life  Woman  lottery  set for life  Rs 9  6 lakh  30 years  Woman reaction  Laura Hoyle  

Other Articles