Truck driver tries to run over toll plaza employee లారీ డ్రైవర్ దాష్టికం.. వాహనం నిలపాలన్న టోల్ ప్లాజా సిబ్బందిని..

Viral video truck driver tries to run over toll plaza employee

Truck Driver Tries to Run Over Toll Plaza Employee, Haryana Truck Driver, North Indian Truck Driver, Truck Driver accident, truck driver accident in dhone, Truck driver accident in kurnool, amakatadu toll plaza employee truck driver, amakatadu toll plaza, toll gate employee, Haryana truck driver, Accident, Dhone, Kurnool, Andhra Pradesh, Crime

A truck driver tried to run over a toll plaza employee near Amatkadu toll plaza after the employees tried to stop them after receiving police orders. According to the reports, a lorry driver from Haryana met with an accident in Dhone, Kurnool and escaped from the spot. Alerted police informed the information to the toll plaza employees at Amakatadu and asked them to stop the vehicle.

ITEMVIDEOS: లారీ డ్రైవర్ విలనిజం.. వాహనం నిలపాలన్న టోల్ ప్లాజా సిబ్బందిని..

Posted: 04/28/2022 01:16 PM IST
Viral video truck driver tries to run over toll plaza employee

ఓ లారీ డ్రైవర్ టోల్​గేట్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. లారీని ఆపాలని అడ్డుకున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టాడు. సినిమాల ప్రభావమో లేక అతనిలోని నేరప్రవృత్తి కారణమో తెలియదు కానీ.. ఏం  చేసైనా సరే తప్పించుకోవాలని చూసిన లారీ డ్రైవర్.. ఆ ప్రయత్నంలో లారీ ముందుభాగంలో బంపర్ పైకి ఎక్కిన టోట్ ప్లాజా సిబ్బందిని అలాగే ఉంచి ఆపకుండా 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఎక్కడ ఏ చిన్న పోరబాటు జరిగినా నిండు జీవితం బలైపోయేది. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో టోల్ ప్లాజా సిబ్బందికి ప్రాణం తిరిగివచ్చినట్లు అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే..? కర్నూలు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ టోల్​గేట్ సిబ్బందికి చుక్కలు చూపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పేందుకు యత్నించిన టోల్‌గేట్‌ సిబ్బందిని సైతం లెక్క చేయకుండా ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. అమకతాడు టోల్ గేట్ వద్ద హరియాణా లారీని ఆపమని గుత్తి టోల్‌గేట్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. లారీని ఆపేందుకు అమకతాడు టోల్ ప్లాజా సిబ్బంది శ్రీనివాసులు యత్నించాడు.

శ్రీనివాసులు లారీ ముందు భాగంలోని లారీ బంఫర్ పై ఎక్కి.. డ్రైవర్ ను కారును పక్కన నిలబెట్టాలని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన అలా ముందు నిలబడినా.. డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా లారీని ముందుకు పోనిచ్చాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 10 కిలోమీటర్ల దూరం పాటు 40కి మించిన వేగంతో పోనిచ్చాడు. అప్రమత్తమైన టోల్‌గేట్ సిబ్బంది నాలుగు బైక్‌లతో లారీని వెంబడించి... హైవే పోలీసులకు సమాచారం అందించారు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి శ్రీనివాసులును కాపాడారు. ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles