ఏప్రిల్ నెల ముగింపుకు కొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో 5 రోజుల్లో మే నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 బ్యాంక్స్ సెలవుల జాబితాను ప్రకటించింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, వేడుకల ఆధారంగా బ్యాంకుల సెలవుల జాబితాను రూపొందించింది. సాధరణంగా బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీలుగా ఉంటాయి. స్టేట్- హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు.. వీటి అధారంగా ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సెలవులు వస్తుంటాయి. ఇక మే నెలలో మెుత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, మే నెల అరంభంలోనే బ్యాంక్‌లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. ఈ సెలవులు రాష్ట్ర, స్థానిక పండుగల వారీగా మారవచ్చు. జాతీయ సెలవులతో పాటు బ్యాంకులకు రాష్ట్రాల ప్రకారంగా కొన్ని సెలవులు ఉంటాయి. మే నెలలో 31 రోజులకు గాను 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మే నెలలో బ్యాంక్ వెళ్లే ముందు సెలవులు దినాలకు చూసుకోవాలని ఖాతాదారులను బ్యాంకులు అభ్యర్థించాయి. నగరం లేదా రాష్ట్రంలో ఏ రోజుల్లో బ్యాంచ్‌లలు బంద్ ఉంటాయో కస్టమర్‌లందరూ గమనించాలని RBI తెలిపింది.
మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా:
మే 1, 2022 - ఆదివారం, మేడే కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర దినోత్సవం.
2 మే 2022 - మహర్షి పరశురామ జయంతి - అనేక రాష్ట్రాల్లో సెలవులు
3 మే 2022 - ఈద్-ఉల్-ఫితర్, బసవ్ జయంతి (కర్ణాటక)
4 మే 2022 - ఈద్ -ఉల్-ఫితర్, (తెలంగాణ)
8 మే 2022 - ఆదివారం
9 మే 2022 - గురు రవీంద్రనాథ్ జయంతి - పశ్చిమ బెంగాల్ మరియు త్రిపుర
14 మే 2022 - రెండవ శనివారం బ్యాంకింగ్ సెలవు
15 మే 2022 - ఆదివారం
16 మే 2022 - బుద్ధ పౌర్ణిమ
22 మే 2022 - ఆదివారం
24 మే 2022 - ఖాజీ నజ్రుల్ ఇస్మాయిల్ పుట్టినరోజు - సిక్కిం
28 మే 2022 - నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవులు
29 మే 2022 - ఆదివారం
(And get your daily news straight to your inbox)
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more
Jun 25 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్ విధించింది. సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావును సికింద్రాబాద్ అల్లర్లలో... Read more
Jun 25 | అపరిచితులతో అన్ లైన్ స్నేహాలు మంచికి అసలు అది మార్గమే కాదు.. ఏదో పోరబాటున తప్ప.. ఇక చెడుకు నూటికి నరుపాళ్లు అస్కారముందని అన్ లైన్ స్నేహాలు మోజులో పడి ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నవారి ఘటనలను... Read more
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more