After hijab, Bible in school triggers row in Bengaluru హిజబ్ అంశం ‘సుప్రీం’లో ఉండగానే.. కర్ణాటకలో మరో వివాదం..

Row after bengaluru school asks students to carry bible in bags

bengaluru, Bhagvad Gita, bible, school, Karnataka, Mahabharat, karnataka bible school, bengaluru bible school, karnataka bible issue, karnataka bible education, clarence high school, hijab verdict, religious conversion, school, right-wing groups, Bengaluru, Karnataka, Politics

After Hijab ban in schools and colleges, Bible in a school has now triggered a row in Karnataka. A school in Bengaluru has made it compulsory for the students to carry Bible to the premises. According to media reports, the school has taken an undertaking from the parents that the students wouldn’t object to carrying Bible or hymn book to the school. Bible is a collection of scriptures sacred in Christianity.

హిజబ్ అంశం ‘సుప్రీం’లో ఉండగానే.. కర్ణాటకలో మరో వివాదం..

Posted: 04/25/2022 01:08 PM IST
Row after bengaluru school asks students to carry bible in bags

కర్నాటక రాష్ట్రం వివాదాలకు కేరాఫ్ గా మారుతోందా.? ఎందుకని ఆ రాష్ట్రంలో ఒకటి తరువాత మరోక అంశాలు వివాదాస్పదం అవుతున్నాయి? ప్రజల దృష్టిని పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ఇంధన ధరల నుంచి ఏదో ఒక అంశం వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇది భాగమేనా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని తటస్థ హిందూ ఓటర్లపై ప్రభావాలను చూపే అంశాలను తెరపైకి తీసుకువస్తూ.. వారిని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగుతున్నాయా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ అంశాలను తహిజాబ్‌ తర్వాత మరో కొత్త వివాదం మొదలైంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ వార్డులలో పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హామీ తీసుకుంది. దీనిపై రైట్ వింగ్ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జన జాగరణ్‌ సమితి పాఠశాల చర్యను వ్యతిరేకించింది. పాఠశాల హిందూయేతర విద్యార్థులను బైబిల్‌ను చదవాలని బలవంతం చేస్తుందని సంస్థ ప్రతినిధి మోహన్‌ గౌడ ఆరోపించారు. మరో వైపు పాఠశాల యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది.

పాఠశాల బైబిల్ విద్యను అందజేస్తుందని ఆయన చెప్పారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్‌లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది. అయితే, పాఠశాల తన వైఖరిని సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యను అందజేస్తామని పాఠశాల పేర్కొంది. ఇదిలా ఉండగా.. కర్నాటక ప్రభుత్వం పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని సైతం ఆలోచిస్తున్నది. ఇప్పటికే కర్నాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతున్నది. ఈ వ్యవహారంపై విచారణ సుప్రీం కోర్టులో ఉన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles