యెమెన్‌లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకున్న తరుణంలోనూ భారత్ కు చెందిన ఏడుగురు నామికులు మూడు నెలల తరువాత ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. హౌతీ నియంత్రణలో వున్న యెమెన్ రాజధాని సనా నుంచి మొత్తంగా 14 మంది విదేశీయులను విడుదల అయ్యారు. కాగా అందులో ఏడుగురు భారత్ కు చెందిన నావికులు ఉన్నారు. యూఏఈ జెండాతో కూడిన వాణిజ్య నౌక హౌతి తిరుగుబాటు దారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న వారందరినీ తమ అదుపులోకి తీసుకుని నిర్భంధంలో ఉంచి విషయం తెలిసిందే.
మూడునెలల పాటు హౌతీ తిరుగుబాటుదారుల చేరలో బందీలున్న ఉన్న వారంతా విడుదలయ్యారు. యెమెన్ రాజధాని సనాలో ఆదివారం విడుదలైన 14 మంది విదేశీయుల్లో ఏడుగురు భారతీయ నావికులు ఉన్నారని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ అల్బుసైది పేర్కొన్నారు. మొత్తంగా కెప్టెన్ కార్లోస్ దేమాటా, మహ్మద్ జాషిమ్ ఖాన్, అయెనాచెవ్ మెకోనెన్, దీపాష్ మూటా పరంబిల్, అఖిల్ రేగు, సూర్య హిదాయత్ ప్రథమ, శ్రీజిత్ సజీవన్, మహమ్మద్ మున్వర్ సమీర్, సందీప్ సింగ్, ల్యూక్ సైమన్స్ మరియు అతని భార్య మరియు బిడ్డ, మౌంగ్ థాన్ విఎస్‌ఎస్‌జి వాసంశెట్టిని యెమెన్‌లో కస్టడీ నుంచి విడుదల చేశామని రు' అని అల్బుసైది ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు.
విడుదలైన భారతీయులు ప్రస్తుతం ఒమన్ సంరక్షణలో ఉన్నారని వారిని సురక్షితంగా పంపుతామని ఆయన తెలిపారు. మూడు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న తర్వాత యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు భారతీయ నావికులతో పాటు దేశాలకు చెందిన వారిని బంధీలుగా పట్టుకున్నారు. కాగా ఏడుగురు భారతీయు నావికులను యెమెన్ సైనికులు విడుదల చేయడంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రోఫెసర్ జైశంకర్ యెమెన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒమన్ దేశం చేసిన సాయానికి ఆయన ధన్యవాదలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more
Jun 25 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ అటు శివసేన పార్టీ అనుకూల, ప్రతికూల వర్గాలతో పార్టీ నిట్టనీలువునా రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటే మహారాష్ట్రవాసుల్లో ఉన్న భక్తి, అయన... Read more