BJP Protest against TRS leader sexual Harassment టీఆర్ఎస్ నేత లైంగిక వేధింపులపై మహిళ పిర్యాదు..

Bjp protest against kukatpally trs leader sexual harassment

BJP Protest against Satish Arora, BJP protest KPHB Police Station, TRS leader sexual harrassment, Kukatpally shadow MLA Satish Arora, MLA Madhavaram Krishna Rao main follower Satish Arora, Satish Arora sexual harrasment, BJP Protest, KPHB Police Station, TRS leader, Kukatpally shadow MLA, MLA Madhavaram Krishna Rao, Satish Arora, Kukatpally, Telangana, crime

BJP leaders hels protest in front of KPHB police stattion demanding the arrest of the main follower and TRS leader Reddy Satish Arora in connection with Sexual Harrassment case.

కూకట్ పల్లి టీఆర్ఎస్ నేత లైంగిక వేధింపులపై మహిళ పిర్యాదు..

Posted: 04/20/2022 05:15 PM IST
Bjp protest against kukatpally trs leader sexual harassment

ఓ ఎమ్మెల్యే అనుచరుడి లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానని, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కూకట్ పల్లికి చెందిన మహిళ సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ లో సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనకు ఆత్మహత్యనే శరణ్యమని, తన ఫిర్యాదునే మరణ వాంగ్మూలంగా పరిగణిస్తూ న్యాయం చేయాలంటూ వేడుకుంది. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. బాధిత మహిళనే నేరస్తురాలిగా పరిగణించి.. అకారణంగా పోలిస్ స్టేషన్ కు పిలిపించి.. సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. అమె మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని రెండు రోజుల తరువాత ఇచ్చారని తెలిపింది. నగరంలోని అధికార పార్టీ నేతల వికృత చేష్టలపై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నా.. ఇంకా తీరుమారడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బాధిత మహిళ కథనం ప్రకారం కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో నివసించే తాను.. గతంలో కూకట్ పల్లి వసంతనగర్ లో ఉంటూ బొటిక్ నిర్వహించేంచేదానని చెప్పారు. ఆమె ఇంటిపక్కనే ఉన్నవారు ఓ భవన నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి గేట్ ముందు కార్లు నిలపడం, బిల్డింగ్ సామగ్రి పెట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని.. వాటిని తొలగించాలని కోరితే.. తమపైకి తిరగబడ్డారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్ పల్లి కో ఆర్డినేటర్ సతీష్ అరోరా (రెడ్డి సతీష్) కారు డ్రైవర్ తనను నోటికి వచ్చిన బూతులు తిట్టాడని బాధితురాలు తెలిపింది. బిల్డింగ్ ఓనర్‌ను కూడా నువ్వెంత నీ బతుకు ఎంత అంటూ అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది.

సతీష్ అరోరా పలుమార్లు తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఎక్కడికి వెళితే అక్కడ మనుషులను పెట్టించి అసభ్యంగా మాట్లాడిస్తున్నారని పేర్కొంది. తన ఫోన్ ను హ్యాక్ చేసి కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్, యూ ట్యూబ్, కెమెరా అన్నీ చూస్తున్నారని తెలిపింది. తాను వేసుకునే డ్రెస్, ఆభరణాలు, ఇతరత్రా పర్సనల్ వ్యవహారాలు కూడా తనకు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులతో, థర్డ్ జెండర్స్ తో బెదిరింపులకు గురిచేస్తున్నారని వెల్లడించింది. తనతో గడిపితే డబ్బులు సంపాదించుకోవచ్చని, ఒక్కసారైనా తనతో గడపాలని వేధిస్తున్నారంటూ ఆరోపించింది.

టీఆర్ఎస్ నాయకుడు సతీస్ అరోరా వల్ల తనకు ప్రశాంతత కరువైందని సీపీ కార్యాలయంలో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకపోగా ఓ కానిస్టేబుల్, మరో ఎస్సై తన వద్దకు వచ్చి స్టేషన్‌కు రమ్మని బలవంతం చేశారని.. లేడి కానిస్టేబుల్ ఏదని అడిగితే ఆమెను పిలిపించి నేరం చేసిందానిలా తనను స్టేషన్ కు తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారని వాపోయింది. ఎస్సై అవమానకరంగా మాట్లాడారని, కేసులు పెడతామంటూ బెదిరించారని తెలిపింది.

తన ఫోన్ తీసుకుని రెండు రోజుల వరకు ఇవ్వలేదని ఫిర్యాదులో వెల్లడించింది బాధిత మహిళ. తనకు జీవనాధారమైన బొటిక్ ను తీసేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని వివరించింది. ఈ క్రమంలో సతీష్ అరోరా సహా అతని డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కోంది. టీఆర్ఎస్ నేత సతీష్ అరోరాతో తనకు ప్రాణహాని ఉందని.. తనను, తమ కుటుంబాన్ని రక్షించాలంటూ పోలీసులను వేడుకుంది. వేధింపులకు అధికమై తనకు జరగరానిది జరిగినా.. లేక తాను తట్టుకోలేక మరణించినా ఈ ఫిర్యాదును మరణ వాంగ్మూలంగా పరిగణించాలని బాధితురాలు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles