TG Venkatesh booked in land encroachment case బీజేపి రాజ్యసభసభ్యుడిపై కేసు.. రూ.100 కోట్ల స్థలం వివాదంలో దౌర్జన్యం..

Banjara hills police book 69 people in rs 100 cr land grab case

AP Gems and Jewellery Park, BJP MP TG Venkatesh, Vishwa prasad, illegal land grabbing, bogus certificates, Rs.100 crore land, land grabbing case, Banjara hills, Hyderabad police, Telangana

Police have booked a case against the Andhra Pradesh BJP MP TG Venkatesh and his brother’s son Vishwaprasad in connection with the alleged illegal grabbing of a piece of 100-crore prime land at Banjara Hills in Hyderabad as the henchmen of Vishwaprasad created ruckus in the area.

బీజేపి రాజ్యసభసభ్యుడిపై కేసు.. రూ.100 కోట్ల స్థలం వివాదంలో దౌర్జన్యం..

Posted: 04/18/2022 12:25 PM IST
Banjara hills police book 69 people in rs 100 cr land grab case

హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదు, విలాసవంతమైన ప్రాంతంలోని అర ఎకరం స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. అంతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అంగబలం, అర్థబలం ఉన్న బడాబాబులకు దానిని  విక్రయించారు. ఇక రంగంలోకి దిగిన బడాబాబులు దానిని హస్తగతం చేసుకునేందుకు ఏకంగా తమ మనుషులను రాష్ట్రం సరిహద్దుల దాటించి హైదరాబాద్ నడిబోడ్డున మరణాయుధాలతో హంగామా సృష్టించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి 63 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ భూమి దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేస్తుందని పోలీసులు పేర్కోన్నారు.

ఈ భూ వివాదానికి సంబంధించిన కేసులో ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్లర్స్ పార్క్‌ కోసం 2005లో అప్పటి ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. దీనికి ఆనుకుని ఉన్న మరో అర ఎకరానికిపైగా ఉన్న స్థలాన్ని కొందరు వ్యక్తులు.. టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్‌తో ఇటీవల డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.

దీంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోని నుంచి దాదాపు 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకోగా, గమనించిన కొందరు పరారయ్యారు. మిగిలిన 63 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మొత్తం 15 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే, పట్టుబడిన వారిపై హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles