Naughty Turtle troubles a Lion while drinking water దప్పికేసి నీరు తాగుతున్న సింహాంతో కూర్మం ఆటలు..

Viral video turtle annoys lion while drinking water from a river

Sher Ka Video, Kachua Ka Video, Sher Aur Kachua Ka Video, Wild Animal Fight Video, Turtle Disturbed Lion, Lion Vs turtle Video, Omg Video, Lion drinking water, Lion while drinking water, Naughty Turtle troubles a huge Lion while drinking water, Viral Video, Animal Fight Video, lion Attack Video, Trending Video, Rare Video, Weird video, humorous video

A viral video of a lion interrupted by a turtle while drinking water from a river is going viral. The video is shared on an Instagram page 'Finest of world' which has more than 50,000 followers.

ITEMVIDEOS: ‘‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ’’ సింహంతో తేల్చిచెప్పిన తాబేలు..

Posted: 04/15/2022 10:36 PM IST
Viral video turtle annoys lion while drinking water from a river

అడవికి సింహమే పాలకుడని చిన్నప్పటి నుంచి మనకు నేర్పుకున్నాం. అందకనే మృగరాజు అని కూడా దానిని పిలుస్తారు. అయితే అంతటి భారీ ఆకారమున్న సింహాన్ని తిట్టాలన్నా.. తలపడాలన్నా.. అందుకు సమవుజ్జీ కావాలి. కానీ చిన్ని తాబేలు సింహాన్ని ఆటపట్టించడం సాధ్యమేనా.. అదెలా సాధ్యమంటారా.? కానీ అది సాథ్యమే.. మీరెప్పుడూ చూడని ఈ దృశ్యం ఇక్కడ సాక్ష్యాత్కార్యమైంది. తాబేలు సింహానికి చికాకు తెప్పించిన హాస్యభరితమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఈ వీడియోను "గెట్ ఆఫ్ మై పాండ్" అనే సందేశంతో తమ ఖాతాకు షేర్ చేశారు.

ఓ సింహం తనకు దప్పికేసి ఓ నది ఒడ్డుకు చేరుకుని ప్రశాంతంగా నీళ్లు తాగుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. అకస్మాత్తుగా, ఒక తాబేలు నది నుండి బయటకు వచ్చి సింహాన్ని కలవరపెడుతుంది. దాహంతో ఉన్న సింహం ఆశ్చర్యపోయి, నీరు త్రాగడానికి తన స్థలాన్ని మార్చుకుంది. అయితే, తాబేలు మళ్లీ సింహం నోటి దగ్గరికి వచ్చింది. ఏదో తినిపించేందుకు సింహం నోటి వద్దకే చేరుకుందని అనిపించేలా వుందీ వీడియె. అయితే తినిపించడం కాదు.. సింహానికి తాబేలు చిరాకు తెప్పించింది. దీంతో మరోమారు సింహం తాను నీరు తాగే స్థలాన్ని మార్చింది.

అయినా కూర్మం మాత్రం సింహాన్ని వదిలిపెట్టలేదు. మళ్లీ అది నీరు తాగే ప్రాంతానికి చేరుకుంది. ఇలా మృగరాజును తాబేలు వేదిస్తూనే కనిపించింది. దీంతో సింహం అక్కడి నుంచి వెళ్లిపోతూనే ఉంది. అప్పుడే ఏదో జీవిని ఆరగించి దాహమేసి నది ఒడ్డకు వచ్చినట్లు సింహం. అందుకనే వేటాడే మూడ్‌లో లేడని తెలుస్తోంది. వేడి వేసవి రోజున, దాహంతో ఉన్న సింహం ఎక్కువసేపు నీరు త్రాగాలని కోరుకుంది. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పటికే 485 వేలమంది లైక్‌ చేశారు.

 
 
 
View this post on Instagram

A post shared by Finest of World (@finestofworld)


సోషల్ మీడియాలో ఈ వీడియోను వీక్షించిన నెటిజనులు నవ్వుకోకుండా ఉండలేరు. కోందరు ధైర్యంగల తాబేలు అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. "తాబేలు "దయచేసి నన్ను తినగలవా, నేను జీవించి విసిగిపోయాను.. హలో సార్??" మరొకరు, "తాబేలు సింహంతో సరసాలాడడానికి ప్రయత్నిస్తోందని నేను అనుకుంటున్నాను, నా మనసు మార్చుకోండి" అని వ్యాఖ్యానించాడు. ఇంకోందర్దు ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అని సింహానికి తాబేలు తేగేసి చెప్పిందని అంటున్నారు. అడవిలోని ప్రాణులను భయపెట్టే సింహానికి తాబేలు చుక్కలు చూపించిందంటూ మరికోందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ వీడియో నాలుగేళ్ల క్రితం.. ఓ అడవిలో వైకల్యం ఉన్న ఓ శునకం.. సుఖంగా నిద్రిస్తున్న రెండు సింహాలపైకి మొరుగుతున్న ఎగబడ్డ వీడియో ఒకటి వైరల్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాని వేటాడాలని ప్రయత్నించిన సింహాలకు.. ‘‘నేను గ్రామసింహాన్ని కాదు.. నేనే సింహాన్ని అంటూ శునకం చాటిచెప్పింది’’ ఆ వీడియోను వీక్షించిన నెట్ జనులు కామెంట్లు చేశారు. ఆ ఘటనను ప్రస్తుతం తాబేలు వీడియో ట్రెండ్‌ అవుతున్న క్రమంలో.. ఈ పాత వీడియో సైతం మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh