Mansitting in convertible BMW accidentally falls off on road కారులో కూర్చున్న వ్యక్తి.. ఎలా బయటపడ్డాడు.?

Viral video an falling out of bmw as friend tries to show off at car meet

BMW M4, BMW, Ultimate BMW Car Meet, British Motor Museum, viral video, epic fail, embarrassing fails, car fail, racing fail, bmw fail, man falling out of bmw, man falls out of bmw, british motor museum, bmw convertible, bmw m4, drop top bmw, Warwick, United Kingdom

The incident took place when a group of four friends were attending Ultimate BMW Car Meet at the British Motor Museum in Warwick, UK. The day event was packed with BMW fanatics desperate to get a glimpse of other modified motors. But the driver of the black convertible got a little too carried away and in an attempt to show off sent his friend hurtling to the ground.

ITEMVIDEOS: బీఎండబ్యూ కారులో కూర్చున్న వ్యక్తి.. ఎలా బయటపడ్డాడు.?

Posted: 04/16/2022 11:25 AM IST
Viral video an falling out of bmw as friend tries to show off at car meet

అది అత్యంత ఖరీదైన కారు. అందులోనూ టాప్ లెస్‌ బీఎండబ్ల్యూ. ఈ కారులో సరదాగా వెళ్తేనే ఓ రేంజ్ లో రేంజ్ పెరిగిపోతోంది. ఇక ఇలా టాప్ లెస్ కారులో వెళ్తే.. మస్తు సౌండ్ పార్టీ.. అని అంచనా వేసేస్తారు. ఈ కారు ఓ షోలో పాల్గోనే సమయంలో ఇక అందులో వెళ్తే.. ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. అయితే ఇలాంటి టాప్ లెస్ కారులో వెనుక వైపు అంచున కూర్చొన్న వ్యక్తి ఉన్నట్టుండి బ్యాలెన్స్‌ తప్పి రోడ్డుపై పడ్డాడు. కారు వేగాన్ని అందుకునే సరికి గట్టిగా పట్టుకోవాలన్న తన ప్రయత్నాలు విఫలమై కారు అందుకున్న వేగానికి ఒక్కసారిగా గాలి వేగంతో వెనక్కు జారాడు.

అందుకునేందుకు ఏదీ అందుబాటులోకి లేకపోవడం.. అప్పటికే జర్క్ ఇచ్చినట్టుగా వెనక్కు వెళ్లి కాళ్లు రెండు గాలిలో తేలగా.. అదృష్టం కొద్ది కిందపడినా దెబ్బలు తగల్లేదు. ఇది చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు. బ్రిటన్‌లోని వార్విక్‌ బ్రిటీష్ మోటార్ మ్యూజియంలో గత ఆదివారం ‘అల్టిమేట్ బీఎండబ్ల్యూ కార్ మీట్” జరిగింది. పలువురు తమ బీఎండబ్ల్యూ కార్లలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం నలుగురు స్నేహితులు టాప్‌లెస్‌ స్టైలిస్ బీఎండబ్ల్యూ ఎం4లో ఆ వేదిక నుంచి వెళ్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్న ఒక వ్యక్తి ఆ కారు వెనుక అంచుపై కూర్చొన్నాడు.

కాగా, స్పీడ్‌ బ్రేకర్‌ను దాటగానే డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. దీంతో కారు వెనుక అంచుపై కూర్చొన్న వ్యక్తి అదుపుతప్పి కారు నుంచి ఎగిరి వెనుక వైపు రోడ్డుపై పడ్డాడు. గమనించిన స్నేహితులు కారును ఆపారు. దీంతో రోడ్డుపై పడిన వ్యక్తి పైకి లేచి కారు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న వారు దీనిని చూసి తెగ నవ్వుకున్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా పలు ఇమోజీలతో కామెంట్లు చేశారు. ఖరీదైన కారు నుంచి రోడ్డుపై పడిన వ్యక్తిపై కొందరు జాలి చూపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BMW M4  BMW  Ultimate BMW Car Meet  British Motor Museum  Warwick  United Kingdom  

Other Articles

Today on Telugu Wishesh