SCR restores 86 MMTS services with half an hour frequency అరగంటకో ఎంఎంటీఎస్ రైలు.. తొలి, చివరి రైలు వేళల్లోనూ మార్పులు

South central railway restores 86 mmts services with half an hour frequency

AVTM, COVID-19, Hyderabad, MMTS, South Central Railway, Secunderabad-Lingampally, Secunderabad-Falaknuma, Hyderabad-LIngampally, Tellapur to Lingampally, Ramachandrapuram to Secundrabad, MMTS train Frequency, MMTS Train Timings, MMTs News

The South Central Railway (SCR) on Thursday announced that it has restored the services of 86 MMTS (Multi-Modal Transport System). Prior to the COVID-19 pandemic, the SCR ran 120 MMTS services. However, post the second wave, it was reduced to 65 services.

ఇకపై అరగంటకో ఎంఎంటీఎస్ రైలు.. తొలి, చివరి రైలు వేళల్లోనూ మార్పులు

Posted: 04/15/2022 01:52 PM IST
South central railway restores 86 mmts services with half an hour frequency

అటు ఇంధన ధరలు, ఇటు నిత్యావసర సరుకులధరలు, కూరగాయాలు మొదలుకుని అన్నింటిపై ధారాఘాత ప్రభావం పడిన నేపథ్యంలో నగరవాసికి ఎట్టకేలకు ఊరటను కల్పించే చర్యలను చేపట్టింది దక్షిణమధ్య రైల్వే. నగరంలోని తూర్పు ప్రాంతాలతో దక్షిణాది ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రతిరోజు పరుగులు తీసే ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై కరోనాకు ముందు తరహాలోనే పరుగులు తీయనున్నాయి. అంటే కరోనాకు ముందు పట్టాలపై పరుగులు పెట్టిన ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్య అప్పటి తరహాలోనే ఇకపై కొనసాగనుంది.
 
అంతేకాదు గతంలో మాదిరిగానే ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. ఇక దీంతో పాటు ప్రతీ రోజు ఎంఎంటీఎస్ రైళ్లు సేవలు అందించే సమయం కూడా పెరగింది. ప్రతి రోజు తొలి రైలు ఉదయం 4.30 గంటలకు ప్రారంభం కానుండగా, చివరి రైలు రాత్రి 12.30 గంటలకు సేవలను అందించనుంది. కోవిడ్‌ కారణంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్‌ సర్వీసులను గణనీయంగా పెంచారు.

ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్‌  మేరకు  సర్వీసులను పెంచినట్లు  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు  తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణపై ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో  రవాణా సదుపాయాన్ని అందజేసే  ఎంఎంటీఎస్‌ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం  చేసుకోవాలని కోరారు.  

కోవిడ్‌ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయపాలనను  కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి  12.30 గంటల వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయి. కరోనా మహమ్మారి తరువాత గతేడాది జూన్‌ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలు ఎక్కాయి. అయితే కొన్ని రూట్‌లలో  ప్రయాణికుల డిమాండ్‌ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్‌నుమా నుంచి  లింగంపల్లి, తెల్లాపూర్‌ రామచంద్రాపురం నుంచి నాంపల్లి వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు.  

ప్లాట్‌ఫాం చార్జీల కంటే  తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్‌  సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ  ఉంటే ఎంఎంటీఎస్‌ రైళ్లలో  కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తదితర  వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను  వినియోగించుకోవాలని జనరల్‌ మేనేజర్‌ కోరారు. టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్లు, యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles