Indian-origin doctor in UK guilty of sex offences 48 మంది మ‌హిళా పేషెంట్ల‌ను వేధించిన భారతీయ వైద్యుడు‌..

Indian origin doctor in uk guilty of sex offences against 48 women patients over 35 years

Doctor, UK, India, sex offences, inappropriate examination, sleazy comments, kissing, groping, general practitioner (GP), Glasgow High Court, North Lanarkshire, prosecutor Angela Gray, Scotland, British Empire (MBE) honour, United Kingdom, Crime

A 72-year-old Indian-origin doctor practicing in Scotland was found guilty of sex offences against 48 female patients over 35 years on 14 April, 2022. Krishna Singh, a general practitioner (GP), was accused of kissing, groping, giving inappropriate examinations and making sleazy comments, charges that he had denied during a trial at the High Court in Glasgow.

48 మంది మ‌హిళా పేషెంట్ల‌ను వేధించిన భారతీయ వైద్యుడు‌.. దోషిగా నిర్థారణ

Posted: 04/15/2022 12:38 PM IST
Indian origin doctor in uk guilty of sex offences against 48 women patients over 35 years

‘‘ఏదేశమేగినా..ఎందుకాలిడినా.. పోగడరా నీతల్లి భూమి భారతిని.. నిలుపురా నీ జాతి నిండుగౌరవము’’ అంటూ నవ్యకవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తన కవిత్వం ద్వారా చెప్పినా.. పెడచెవిన పెట్టిన ఓ భార‌త సంత‌తికి చెందిన 72 ఏళ్ల డాక్ట‌ర్ దేశం కానీ దేశంలో.. భారత దేశం పరువు తీసే చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. తాను చేసిన పాడు చేష్టలకు దోషిగా కూడా తేలాడు. దోషిగా తేలినా.. అతను పొందిన రాజసత్కారాన్ని అక్కడి న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుని ఆయనకు కండీషనల్ బెయిల్ మంజూరు చేశాయి. ఆ భారతీయ వైద్యుడి పేరే కృష్ణ సింగ్. ఆయన చేసిన నేరం.. మ‌హిళా పేషెంట్ల‌ను లైంగికంగా వేధించడం.

యూనైటెడ్ కింగ్డమ్ లోని గ్లాస్కో హైకోర్టు భారతీయ వైద్యుడు కృష్ణ సింగ్ ను దోషిగా తేల్చింది. బ్రిటీష్ అంఫైర్ నుంచి తన వైద్య సేవలకు గానే మెంబర్ అప్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ అంఫైర్ (ఎంబిఈ) గౌరవ వందనాన్ని పోందిన వైద్యుడు.. ఇలాంటి పాడు పనులు చేస్తూ దోషిగా తేలడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్కాట్‌లాండ్ లో జనరల్ ప్రాక్టీషనర్ వైద్యుడిగా సేవలందిస్తున్న వైద్యుడు దాదాపుగా మూడున్నర దశాబ్దాలుగా సుమారు 48 మంది మ‌హిళా రోగుల‌తో లైంగిక దాడులకు పాల్పడటం.. రోగులతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించడం.. వారికి అవసరం లేని పరీక్షలు చేయిండంలాంటి చర్యలకు పాల్పడ్డాడని గ్లాస్కో న్యాయస్థానం నిర్ధార‌ణించింది.

జనరల్ ప్రాక్టీషనర్ కృష్ణ సింగ్‌.. మ‌హిళా రోగుల‌ను వారిళ్లలో కలిసిన సమయంలో వారితో అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. ముద్దులు ఇవ్వ‌డం, మహిళారోగుల సున్నిత ప్రదేశాలను నెమ‌ర‌డం వంటి చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అన‌వ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించ‌డం, అస‌భ్య వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేరకు డాక్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే 1983 నుంచి ఆయన ఇలాంటి లైంగికచర్యలకు పాల్పడుతున్నాడని.. కాగా, 2018లో ఓ మహిళా రోగి పిర్యాదుతో ఆయన చేస్తున్న దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయన లైంగికచర్యలపై ఆ తరువాత ఏకంగా పలువురు మహిళలు పోలీసులకు పిర్యాదు చేశారు.

అయితే ఇప్పటికీ పరువు మర్యాదలు అనుకునే మరికొందరు రోగులు ఇంకా బయటకు రావడం లేదన్న వాదనలు ఉన్నాయి. కాగా 35ఏళ్లలో ఏకంగా 48 మంది మహిళలపై లైంగిక చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై న్యాయస్తానం విచారణ జరిపింది. నార్త్ ల‌నార్క్‌షైర్‌లో ఆయన మెడికల్ ప్రాక్టీషనర్ గా సేవలందిస్తున్నప్పుడు ఈ దారుణాలు అధికంగా ఉన్నాయని తేలింది. దీతో పాటు ఆయన లైంగిక చర్యలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని కూడా తేలింది. ఓ అసుపత్రిలో ప్రమాదం సంభవించినప్పుడు, ఎమర్జెన్సీ శాలో సేవలు వినియోగిస్తున్నప్పుడు, పోలిస్ స్టేషన్ తో పాటు రోగుల ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా ఈ దాడులకు పాల్పడ్డాడని తేలింది.

గ్లాస్‌గోలోని హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ స‌మ‌యంలో పేషెంట్లు చేసిన ఫిర్యాదుల‌ను డాక్ట‌ర్ త‌ప్పుప‌ట్టారు. తాను ఎవరితోనూ లైంగిక చర్యలకు పాల్పడలేదని, ఇక అనవసర పరీక్షలు చేయనూ లేదని చెప్పారు. ఇండియాలో వైద్యశిక్ష‌ణ తీసుకున్న స‌మ‌యంలో తాను నేర్చుకున్న ప‌రీక్ష‌లనే వారికి కూడా చేయించుకోవాలని సూచించానని చెప్పాడు. సమాజంలో ఎంతోగౌరవప్రదమైన సభ్యుడిగా కోనసాగుతున్నానని, ఇలాంటి ఆరోపణలతో తనకు కళంకాన్ని ఆపాదించడమే అవుతుందని చెప్పారు. కాగా, మ‌హిళా రోగుల్ని లైంగికంగా వేధించిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్ ఏంజిలా గ్రే వాదించారు. దీంతో తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఆయనకు నెల రోజుల పాటు శిక్షను విధించింది. అయితే ఆ తరువాత ఆయనకు తన పాస్ పోర్టను సరెండర్ చేయాలని కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles