Gurugram tourists drive car in Ladakh's Pangong lake ప్యాంగ్యాంగ్ సరస్సులో పర్యాటకులు పాడు చేష్టలు..

Twitter blasts tourists who drove their audi through ladakh s pangong lake video goes viral

Ladakh, Ladakh Tourism, tourists in Ladakh, Pangong Lake, Pangong Lake Area, Haryana registered vehicle, Haryana Police, Crime

Ladakh is one of the most preferred tourist destinations in the country. But some tourists often leave the place dirty with their irresponsible behaviour. One such video is doing the rounds on social media, which shows three tourists driving their SUV in the waters of the pristine Pangong Lake. The video has been shared by Jigmat Ladakhi. It shows an Audi SUV racing through the lake with two tourists hanging out of the sunroof of the car and yelling.

ITEMVIDEOS: గురుగావ్‌ పర్యాటకుల వికృత చేష్ట‌లు.. ప్యాంగ్యాంగ్ సరస్సులో పాడు చేష్టలు

Posted: 04/11/2022 07:26 PM IST
Twitter blasts tourists who drove their audi through ladakh s pangong lake video goes viral

మనదేశంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకుల మనస్సులను అహ్లాదపర్చే అనేకమైన సుందర ప్రాంతాలు ఉన్నాయి. అనేక సహజమైన అద్భుత సౌందర్య ప్రాంతాల్లో ల‌ద్ధాఖ్‌ కూడా ఒకటి. ఈ ప్రాంతానికి విచ్చేసిన పర్యాటకులు తప్పకుండా ప్యాంగ్యాంగ్ సరస్సును మాత్రం వీక్షించకుండా వెళ్లరు. ఎందుకంటే దేశంలోని అన్ని సరస్సులోకి ఇది సహజసిద్దంగా వెలసి అద్భుతమైన సుందర ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సుకు కేవలం పర్యాటకులే కాదు.. దేశవిదేశాల నుంచి పలు పక్షులు కూడా పర్యటనకు వస్తాయి. వాటిని వీక్షించేందుకు కూడా ప్యాంగ్యాంగ్ వద్దకు పర్యాటకులు వస్తారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ సరస్సును చూస్తే చాలు మనస్సు ఎంతో ఉల్లాసంగా మారుతుంది.

అయితే ప్యాంగ్యాంగ్ స‌ర‌స్సు ప్రాంతం అరుదైన ప‌క్షులకు కూడా అవాసం. ఇక్క‌డ దాదాపుగా 350 ర‌కాల జాతుల‌కు చెందిన ప‌క్షులున్న‌ట్లు అంచ‌నా. అయితే ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పర్యాటకులు ఆ జంతుజాలం భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా సున్నీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పక్షులను పరిరక్షించాల్సిన బాధ్యత స్థానికులు, ప్రభుత్వాలతో పాటు పర్యాటకులపై కూడా ఉందన్న విషయం వారు గుర్తించాలి. అయితే కొంతమంది పర్యాటకులు మాత్రం ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఎంతో నిర్లక్ష్యంగా జుగుప్సాకరంగా వ్యవహరించారు. ప్రస్తుతం అన్ లైన్ లో వీరి వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. పర్యాటకులు నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.

జిగ్మత్ లబఖీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ ప్రాంతానికి ఓ ఖరీదైన కారు (ఆడి)లో వచ్చిన పర్యాటకులు వ్యవహరించిన తీరు.. వన్యప్రాణులు, అరుదైన అతిధుల అవాసంపై ప్రశ్నలను ఉత్పన్నమయ్యేలా చేస్తోంది. వీరి వికృత చేష్టలను చూసిన పర్యావరణ ప్రేమికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. వీరి చేష్టలు అరుదైన వన్య ప్రాణుల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయని వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల వికృత చేష్ట‌ల‌తో ప‌క్షులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతొంది. తాజాగా, గురుగావ్‌కు చెందిన కొంద‌రు టూరిస్టులు ప్యాంగ్యాంగ్ స‌ర‌స్సులో జీపు న‌డిపారు. స‌రస్సులోనే మ‌ద్యం తాగారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లుకొడుతోంది. ప్ర‌కృతి ప్రేమికులు వారిపై మండిప‌డుతున్నారు.

హెచ్ఆర్ 26 రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌తోగ‌ల ఓ బ్లాక్ ఎస్‌యూవీలో ఇద్ద‌రు నిల్చోగా, ఇంకొక‌రు దాన్ని న‌డుపుతూ ప్యాంగ్యాంగ్ న‌దిలో చ‌క్క‌ర్లుకొట్టారు. నీటిలో టేబుల్ వేసి, దానిపై మ‌ద్యం బాటిళ్లు, స్ట‌ఫ్ పెట్టారు. ఈ వీడియోను ‘జిగ్‌మ‌త్ ల‌డ‌కీ’ అనే యూట్యూబ‌ర్‌ సోష‌ల్‌మీడియాలో పెట్టాడు. ‘నేను మ‌రోసారి మ‌నుషులుగా సిగ్గుప‌డే వీడియోను షేర్‌చేస్తున్నాను. ఈ బాధ్య‌తలేని టూరిస్టులు ల‌ద్దాఖ్‌ను చంపేస్తున్నారు.’ అని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ టూరిస్టుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సంబంధిత మంత్రి వీరిపై చ‌ర్య తీసుకోవాల‌ని, లేకుంటే భ‌విష్య‌త్తులో ఇంకొంద‌రు ఇలాగే ప్ర‌కృతిని పాడుచేస్తార‌ని నెటిజ‌న్లు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles