సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ముందుంటారు. మొన్నామధ్య ప్రకృతికి సంబంధించిన ఓ ఫోటోను పంచుకుని దానిని కాస్తా వైరల్ చేశారు. ప్రకృతి సహజసిద్దమైన ఈతకొలను అని క్యాప్షన్ ఇచ్చిన ఆయన ఇలాంటి ఈతకొలనులో ఒక్కసారి జలకాలాడాలని కూడా తన మనస్సులోని కోరికను పంచుకున్నారు. హిమాలయాల్లో ఉన్న ఈ సహజసిద్ద ఈతకొలను స్వర్గాన్ని తలపిస్తోందని అన్నారు.
ఈ ఈతకొలను ఉత్తరాఖండ్ లోని ధార్ చులా ప్రాంతంలో చుట్టూ కోండలు, కోనల మధ్య ప్రకృతి హరివిల్లు నెలకొని ఉండటం గమనార్హం. ఇక తాజాగా ఆయన ఒక వైరల్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో స్నేహం విలువ, స్నేహితుడి అంటే ఎలా ఉండాలో చెబుతుందని అన్నారు. స్నేహం గురించి పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనే కదా!. ఇటీవల ఓ గేద కూడా ఇలాంటి సాయం చేయడం.. దానిని నెటిజనులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అచ్చంగా అలాంటి వీడియోనే ఇప్పడు ఆనంద్ మహీంద్రా నెటింట్లో షేర్ చేశారు.
వివరాల్లోకెళ్తే... ఆ వీడియోలో రెండు తాబేళ్లు ఉన్నాయి. అందులో ఒక తాబేలు బోర్లాపడి లేచేందుకు ఇబ్బందిపడుతోంది. దీంతో ముందువెళ్తున్న తాబేలు తనతో పాటు మరో తాబేలు రావడం గమనించింది. దీంతో ఆ తాబేలు ఆగి మరీ వెనక్కివచ్చి అవస్థలు పడుతున్న ఆ తాబేలుకు సాయం చేస్తుంది. దీంతో ఆ తాబేలు హమ్మయ్య అనుకుంటూ చకచక వెళ్లిపోతుంది. ఈ వీడియోలో తాబేళ్ల మధ్య స్నేహాన్ని వివరించారు మహింద్రా. ‘‘స్నేహానికి అసలైన అర్ధం ఇదే కదా. మనం సమస్యల్లో ఉన్నప్పుడూ మనకు చేయూత నిచ్చి మన కాళ్లపై తిరిగి నిలబడేలా చేసేవాడు నిజమైన స్నేహితుడు. ప్రతిఒక్కరు తమ జీవితంలో మంచి స్నేహితుడి కలిగి ఉండటానికి మించిన గొప్పవరం ఇంకొకటి లేదు." అని అన్నారు.
The phrase ‘Turning turtle’ means to be flipped upside down. But after seeing this I think it should mean helping a friend in need. One of the greatest gifts in life is to have a buddy who helps you get back on your feet and Rise. pic.twitter.com/7VpINFzJdm
— anand mahindra (@anandmahindra) April 8, 2022
(And get your daily news straight to your inbox)
Jul 05 | నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే... Read more
Jul 05 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై... Read more
Jul 05 | స్థానబలం అంటే తెలుసుగా.. ఫలానా స్థానంలో ఫలానావారికి బలం అధికంగా ఉంటుందని అర్థం. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ఈ పదం చాలా వింటూవుంటాం. ఫలానా మైదనాంలో ఫలానా జట్టుకు బాగా కలసివస్తోంది. వారి... Read more
Jul 05 | భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే... Read more
Jul 05 | హిజ్రాలను చూస్తేనే కొందరు ఈసడించుకోగా, మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. ఇక వారు ఎదురుగా వచ్చి డబ్బులు అడిగితే.. లేవని సమాధానం చెప్పి పంపేవారి సంఖ్యే ఎక్కువ. కానీ వారిని కూడా సాధారణ మనుషులు... Read more