తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయం నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్న అతిపురాతన కాలానికి చెందిన భగవత్ దేవతా విగ్రహాన్ని ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. 19వ శతాబ్దానికి చెందిన నాగాభరణంతో కూడిన శివలింగం విగ్రహాన్ని అమెరికాకు అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని చెన్నై ఎయిర్ కార్గో కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. త్రిశూలంలోని కార్గో కేంద్రం నుంచి అమెరికాకు పంపించాల్సిన సరుకులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో 1800 నాటి ప్రాచీన విగ్రహం బయటపడింది.
విగ్రహానికి సంబంధించిన ఎగుమతి పత్రాలు (షిప్పింగ్ బిల్లు) పరిశీలించిన అధికారులకు తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో ఉన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియం నుండి కొనుగోలు చేసినట్లు తెలిసింది. విగ్రహం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుండి నాన్-యాంటిక్విటీ సర్టిఫికేట్ ఎగుమతిదారు సమర్పించలేదని అధికారులు గుర్తించారు. కాగా అధికారుల విచారణలో ఈ పంచలోహ విగ్రహం కళ్లకురిచ్చి జిల్లా తిరునావలూరు సమీపంలోని గెడిలంలోని ఓ వ్యక్తి నుంచి లభ్యమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
అయితే ఈ విగ్రహం ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ ఎంపోరియం నుంచి కొనది కాదని తెలీయడంతో అధికారులు పురావస్తు పరిశోధనా అధికారులను రంగంలోకి దింపి పరీక్షలు నిర్వహింరచారు. వారు నిర్వహించిన దృశ్య పరీక్షలో శివలింగ నాగాభరణ విగ్రహం అతిపురాతనమైనదిగా (1800వ సంవత్సారానికి) చెందినట్లుగా కనుగొన్నారు. ఈ శివలింగ నాగాభరణ పంచలోహ విగ్రహం 36 సెం.మీ (మూడున్నర అడుగుల) ఎత్తు, 4.56 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులకు ఈ విగ్రహం స్మగ్లింగ్ చేస్తున్నారన్న పక్క సమాచారం అందడంతో.. త్రిశూలంలోని కేంద్రంపై దాడి చేశారు. ఈ పురాతన విగ్రహంతో పాటు ఎగుమతి కోసం నమోదు చేసిన ఇతర వస్తువులను కస్టమ్స్ చట్టం, 1962, పురాతన వస్తువుల చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more