Paid Booster Shots For All Adults From Sunday 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ టీకాలు..

Covid booster dose for all adults from sunday at private vaccine centres

booster covid dose, Covid vaccine, booster dose for all adults, booster dose for all, booster dose price, booster dose eligibility, covaxin, covishield, Coronavirus, Vaccine, Booster dose, Paid booster shots, Adults, Private centers, Private vaccine Centers

Coronavirus booster shots will be available to all adults from Sunday at private vaccination centres, the government announced on Friday. The order means that unlike the booster shots announced for healthcare workers, frontline staff and those above 60, the third jab will not be free for most adults.

ఈ నెల 10 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ టీకాలు..

Posted: 04/08/2022 06:38 PM IST
Covid booster dose for all adults from sunday at private vaccine centres

చైనాలో ప్రాణాంతక కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. కరోనా పురుడుపోసుకున్న దేశం నుంచే గత రెండున్నరేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి అధికారికంగా ఏకంగా 61 లక్షల మందిని బలి తీసుకుంది. ఇవాళ్టికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజు సగటున 3,500 మందిని మట్టుబెడుతున్న మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూరైనవారు బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూరైంది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.

చైనాలో కరోనా వైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యమైన నగరాలతో పాటు వాణిజ్యనగరాలు, పారిశ్రామిక నగరాలు ఇలా పలు నగరాల్లో లాక్ డౌన్ అమలులో ఉన్నా వేల సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. ఈ పరిణామం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది. భారత్​కు కూడా ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ప్రికాషన్ డోసులపై దృష్టి పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Vaccine  Booster dose  Paid booster shots  Adults  Private centers  covaxin  covishield  

Other Articles