Telangana Chief Justice Seen Giving Traffic Cop A Bouquet కానిస్టేబుల్ ను సర్ ప్రైజ్ చేసిన తెలంగాణ సీజే

Telangana chief justice satish chandra sharma seen giving traffic cop a bouquet

Telangana High Court, Chief Justice, Satish Chandra Sharma, Homeguard, Ashraf Ali, Abids Traffic Police Station, Babu Jagjivanram statue, Telangana

Impressed by a home guard's exemplary commitment to his work, Chief Justice of the Telangana High Court, Satish Chandra Sharma, was seen felicitating the traffic official on Friday. Justice Sharma, 59, had seen Ashraf Ali, from Abids Traffic Police Station, delivering his services with utmost sincerity, during his regular commute to the High Court. And to boost Mr Ali's morale, he decided to stop his car and appreciate his dedication.

ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సర్ ప్రైజ్ చేసిన తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి

Posted: 04/08/2022 07:23 PM IST
Telangana chief justice satish chandra sharma seen giving traffic cop a bouquet

ట్రాఫిక్ కానిస్టేబుళ్లు గమనిస్తే వారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేతిలో కెమెరాలు పట్టుకుని ఫోటోలు తీస్తూనే కనిపిస్తూన్నారు. నగరంలో చాలా ప్రాంతాలు ట్రాఫిక్  సిగ్నల్ రహితంగా మారడంతో ట్రాపిక్ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారి ఫోటోలు తీసి.. జరిమానాలు విధిస్తున్నారు. కానీ మరికోందరు మాత్రం ఎండ, వాన, చలి ఇలా ఎలాంటి సమయాలు సందర్భాలలోనైనా తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తుంటారు. ఓ వైపు వాహనాల నుంచి వచ్చే కాలుష్యం.. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులు అయినా.. తమలోని శక్తిని కూడగట్టుకుని విధులు నిర్వహిస్తుంటారు.

ఉదయం విధుల్లో చేరిన సమయంలో ఎలా ఉంటారో.. అదే శక్తితో సాయంత్రం విధులు దిగేంతవరకు అలానే ఉంటారు. ఒక్కసారి విధులు దిగిపోగానే.. అప్పడు వారిని నీరసం, అలసత్వం వహిస్తుంటాయి. ఇలాంటి ఎందరో పోలీసుల్లో హైదరాబాద్ రద్దీ రోడ్లపై నిత్యం విధులు నిర్వహించే హోంగార్డు ఒకరు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద తన అకుంటిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ఏకంగా ఆయన రాష్ట్రానికిచెందిన పెద్దాయన దృష్టిలో పడ్డారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద విధులు నిర్వర్తించడం అంటే కత్తి మీద సాములానే ఉంటుంది పరిస్థితి.

ఇలాంటి చోట నిబద్దతతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఏకంగా తెలంగాణ హైకోర్టు సీజే దృష్టిలో పడ్డాడు. అబిడ్స్ సెంటర్ లో రోజూ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు అష్రఫ్ అలీ పనితీరును రోజూ గమనిస్తూ వెళ్తున్నారు సీజే జస్టిస్ సతీశ్ చంద్ర వర్మ. ఈక్రమంలో అతని పనితీరు, వృత్తిపట్ల అంకితభావానికి సీజే ఫిదా అయ్యారు. ఇక అదే మార్గంలో వస్తున్న సీజే కారు ఆపి హోంగార్డు వద్దకు వెళ్లారు. అతడి విధి పట్ల నిబద్ధతను మెచ్చుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. దీంతో అష్రఫ్‌ అలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మేరకు వివరాలను హైదరాబాద్ నగర పోలీసులు ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles