Raw fish comes alive on the plate at a restaurant తినబోయిన ఆహారానికి ప్రాణం వస్తే: విచిత్రమే కదా.!

Watch fish served at a japanese restaurant grabs chopstick in viral video

live fish served in japan, live fish served in japan restaurant, Raw fish turns alive, fish served on table grabs chopstick, Yanagawa restaurant raw fish, Takahiro, Instagram, some vegetables, probably glass noodles, two fish. Yanagawa restaurant, Japan restaurant, Viral Video, Trending

In the light of this, a video has made it’s way to the social media, featuring a whole raw fish served on a plate. However, what surprised netizens was that as the video went further, the fish was seen opening its mouth and grabbing the chopstick. The incident took place at a restaurant in Yanagawa, Japan.

ITEMVIDEOS: తినబోయిన ఆహారానికి ప్రాణం వస్తే: విచిత్రమే కదా.!

Posted: 04/05/2022 08:15 PM IST
Watch fish served at a japanese restaurant grabs chopstick in viral video

వేసవి.. అసలే ఇలా తింటే అలా జీర్ణమయ్యే కాలం. ఈ కాలంలో అకలి ఎక్కువ. ఇలాంటి సమయంలో నోటికి నచ్చిన ఆహారం తినేద్దామని హోటల్ కు వెళ్లి.. చేపల కూర అర్ఢర్ చేస్తే.. హోటల్ వాళ్లు కొంత సమయం తీసుకుని ఆర్డర్ చేసిన ఆహారాన్ని అందిస్తే.. ఏమాత్రం ఆలస్యం లేకుండా దానిని అరగించేస్తే అహా ఏమి రుచి.. తినరా మైరచి అంటూ పాడుకుంటూ లాగించేస్తే.. ఇది సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం. మరి ఇలాంటి అనుభవం కాకుండా విచిత్రమైన అనుభవం ఎదురైతే.. మంచి ఆకలి మీద హోటల్ కు వెళ్లి అర్ఢర్ చేసిన ప్లేటులోని ఆహరం తినబోతుండగా, అదే ఆహారం మీ చేతిలోని స్పూన్ ను పట్టేసుకుంటే.

వినడానికే కాదు.. అనుభవించడం కూడా విచిత్రమే. ఔనండీ ప్లేటులో తీసుకువచ్చిన ఆహారం ఒక్కసారిగా సజీవంగా మారితే.. దానినే తినాల్సి వస్తే.. మీ అనుభవం ఎలాఉంటుంది. విచిత్రంగానే కదూ. పచ్చి చేపను తినమంటేనే ఎవరూ తినలేరు. అలాంటిది నేరుగా బ్రతికున్న చేపను తినమంటే? దాని కన్నా పెద్ద చేప అయితేనో లేక చేపలను తినే జీవి తప్ప ఎవరూ తినలేరు. ఇక మానవమాత్రులతో అసలు కాదు ఎందుకంటే దానిలోని ముళ్లు ఎక్కడ గొంతులో దిగబడతాయోనన్న భయం కూడా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే విచిత్రమైన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రెస్టారెంట్లో చేపతో చేసిన వంటకం ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడి ఇచ్చిన ఆర్డర్ అతడి ముందుకు తీసుకువచ్చి పెట్టారు హోటల్ సిబ్బంది. ఇక తనకు నచ్చిన ఆహారం వచ్చిందని తినడానికి ఉపయుక్తుడవుతున్న వ్యక్తి.. తన చేతిలోకి ఒక చాప్ స్టిక్‌తో ఆ చేపను తినేందుకు సిద్దపడుతూ దాని నోరు బాగం వద్దకు చాప్ స్టిక్ ను తీసుకెళ్లగానే.. ఆ చేప బావురుమంటూ కప్ప తరహాలో పెద్దగా నోరు తెరిచింది. అంతేకాదు రివర్స్ లో ఆ చాప్ స్టిక్‌నే ఆ చేప తన నోట కరిచింది. దాని పళ్లు కూడా పదునుగా ఉన్నాయి. ఆ పళ్లతో గట్టిగా ఆ పుల్లను లాగింది.

జపాన్ లోని యనాగ్వా నగరంలోకి ఒక రెస్టారెంట్ ఈ ఘటన చోటుచేసుకుంది. టకాహీరో అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. రెస్టారెంటు సిబ్బంది ఇలా బ్రతికున్న ఫిష్ వడ్డించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో 7 మిలియన్లకు పైగా వీక్షణలు, 18 000 లైక్‌లను సంపాదించింది. అయితే కామెంట్లు మాత్రం ఓవర్ లోడ్ అవుతున్నాయి. చేప చచ్చినా.. దాని ఆకలి చావలేదు, ఆకలికి చావు లేదు, బతికి ఉన్న చేపలను ఎందుకు తింటున్నారంటూ కమెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
View this post on Instagram

A post shared by TAKAHIRO (@takahiro4601)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh