Shanghai extends lockdown as covid is 'extremely grim' కరోనా విజృంభనతో వణుకుతున్న చైనా వాణిజ్యరాజధాని షాంఘై.!

Shanghai lockdown deepens after new surge in asymptomatic cases

hong kong corona, covid-19 china, coronavirus beijing, jilin, pfizer, gu honghui, shanghai, macao, british airways, china lockdown, china covid record cases, china covid news, china covid cases, coronavirus, covid-19, china economic capital, shanghai, lockdown, extremely grim, hong kong, china, crime

The COVID-19 outbreak in China’s largest metropolis of Shanghai remains “extremely grim” amid an ongoing lockdown confining around 26 million people to their homes, a city official said Tuesday. Director of Shanghai's working group on epidemic control, Gu Honghui, was quoted by state media as saying that the outbreak in the city was “still running at a high level."

కరోనా విజృంభనతో వణుకుతున్న చైనా వాణిజ్యరాజధాని షాంఘై.!

Posted: 04/05/2022 01:40 PM IST
Shanghai lockdown deepens after new surge in asymptomatic cases

చైనాలోని వూహాన్ సిటీలోని ల్యాబ్ లో పురుడుపోసుకుని యావత్ ప్రపంచాన్ని గత రెండేళ్లుగా తీవ్ర బీభత్సం సృష్టించిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు పురుడు పోసుకున్న దేశంలోనే విపరీతంగా విజృంభిస్తూ చెలరేగిపోతోంది. వాణిజ్య రాజధాని షాంఘై కరోనా బారినపడి వణుకుతోంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం ఇక్కడే నమోదవుతుండడం గమనార్హం. దేశవ్యాప్తంగా నిన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, అందులో దాదాపు 9 వేల కేసులు ఒక్క షాంఘైలోనే వెలుగు చూశాయి. దీంతో షాంఘై నగరంలో కరోనా విజృంభన అత్యంత భయంకరంగా వుందని నగర అధికారి తెలిపారు.

షాంఘై నగర అంటువ్యాధి నియంత్రణ డైరెక్టర్ గు హాంగ్ హుయ్.. రాష్ట్రీయ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ తమ నగరంలో కోవిడ్ అత్యధిక స్థాయిలోనే నడుస్తోందని తెలిపారు. అంతేకాదు వ్యాప్తి అత్యంత భయంకరంగా ఉందని కూడా తెలిపారు. నిజానికి ఇక్కడ వారం రోజులుగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఇక్కడ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండడం అధికారులను కలవరపెడుతోంది. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం ఏకంగా పదివేల మంది ఆరోగ్య కార్యకర్తలతో పాటు రెండు వేలమంది సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది.

ఆర్మీ, నేవీ సహకారంతో ఆరోగ్యకార్యకర్తలు, వైద్యులను షాంఘై నగరంలో మాస్ కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. వీరంతా స్థానికంగా లాక్ డౌన్ అములో ఉండటంతో గత కొన్ని వారాలుగా ఇళ్లలోనే ఉన్నారు. తూర్ప షాంఘైలోని పలు ప్రాంతాలు గత శుక్రవారం తమ కార్యకలాపాల కోసం తెరుచుకోవాల్సింది.. కానీ పశ్చిమ షాంఘైలో కేసుల విజృంభన నేపథ్యంలో లాక్ డౌన్ ను యధాతథంగా కొనసాగించారు. ఇక ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని.. కేవలం కరోనా పరీక్షలు, ఇతర అత్యైక పరిస్థితులలో మాత్రమే తమ ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచనలు చేసింది.

ఇక షాంఘై నగరంలో అనేక కోవిడ్ కేసులు లక్షణాలు లేకుండానే వున్నాయి.. సోమవారం రోజున నమోదైన 13 వేల కేసులలో అధికభాగం లక్షణరహిత కేసులేనని తెలిపారు. ఈ నగరానికి పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి కూడా సిబ్బందిని షాంఘై తరలిస్తున్నారు. షాంఘైలో నిన్నటి నుంచి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం షాంఘైలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే, అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఫలితంగా ఆయా సంస్థల సిబ్బంది బయటకు రాకుండా కార్యాలయాల్లోనే ఉంటూ పనిచేస్తూ అక్కడే తిండి, నిద్ర కానిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  china economic capital  shanghai  lockdown  extremely grim  hong kong  china  crime  

Other Articles

Today on Telugu Wishesh