PUBG player makes fake bomb threat call to win game పబ్ జీని మధ్యలో అపలేక.. రైళ్లనే అపేసిన 12 ఏళ్ల బాలుడు.!

Boy makes fake bomb threat at bengaluru railway station to prevent departure of pubg playmate

12 years old boy, PUBG, Yelahanka Railway Station, police Helpline, shutdown for 90 minute, breakdown, bengaluru, bengaluru news, fake call, prank call, hoax, bomb, plant, railway station, PUBG, PUBG bengaluru, crime news

A 12-year-old boy from Bengaluru allegedly made a bomb threat call to the Railway Police Helpline. He claimed to have kept a bomb at the Yelahanka railway station. The authorities promptly responded and shut down the station for 90 minutes, but found it to be a hoax.

పబ్ జీని మధ్యలో అపలేక.. రైళ్లనే అపేసిన 12 ఏళ్ల బాలుడు.!

Posted: 04/04/2022 04:23 PM IST
Boy makes fake bomb threat at bengaluru railway station to prevent departure of pubg playmate

పబ్ జీ గేమ్ ఇప్పటికే ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. పలు ఘటనల్లో ఎంతో మంది చిన్నారులు, యువకులను మానసికంగా కూడా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఓ పదవ తరగతి విద్యార్థి కాల్చివేతకు కూడా గురయ్యాడు. పబ్ జీ గేమ్ ఆడటంపై ఈ విద్యార్థికి అతని స్నేహితుడికి మధ్య వివాదం రేగింది. దీంతో అవేశంలో అతడి స్నేహితుడే 10వ తరగతి విద్యార్థిని కాల్చివేశాడు. ఇక మరో ఘటనలో పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ 12వ తరగతి విద్యార్థికి తన జన్మదినం రోజున అతని తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడిన ఘలన కూడా తెలిసిందే.

ఇక తాజాగా తన స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్న 12 ఏళ్ల బాలుడు ఆటమధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో చేసిన పని తెలిసి పోలీసులు విస్తుపోయారు. తన పబ్ జీ గేమ్ కోసం ఏకంగా పలు రైళ్లను రెండుగంటలపాటు ఆపేశాడా బాలుడు. మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. 30న మధ్యాహ్నం రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టామని, అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడికక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్‌లో బాంబు కోసం తనిఖీలు చేపట్టారు. చివరికి దానిని ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు.

అనంతరం ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీయగా అతడు 12 ఏళ్ల బాలుడని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విస్తుపోయే విషయం చెప్పాడు. మార్చి 30న తాను స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్నానని అయితే, తన స్నేహితుడు కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో వేరే ఊరు వెళ్లాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అతడు వెళ్లిపోతే ఆట మధ్యలోనే ఆగిపోతుందని, కాబట్టి ప్రయాణాన్ని ఆపేందుకు బాంబు పెట్టానని ఫోన్ చేశానని బాలుడు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. అయితే, అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles