Navratri 2022: IRCTC launches special menu ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. వారికోసం స్పెషల్ సదుపాయం.!

Irctc to serve navratri special vrat thali to train passengers

Indian Railways, Indian Railways new facility, IRCTC, Indian Railways food, Indian Railways food facility, Indian Railway Catering and Tourism Corporation, IRCTC, IRCTC navratri thali, IRCTC navratri special, IRCTC navratri special menu, IRCTC navratri thali cost, IRCTC navratri thali items, IRCTC navratri special items, IRCTC navratri special cost, IRCTC navratri special items cost, Navratri 2022, Indian Railways news

Travelling while on a Navratri fast can be a challenging task and getting the food for fasting can be an even bigger challenge. Sometimes people remain hungry while on a train journey but choose not to consume the food available on a train. Keeping this in mind, the Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has launched its Navratri-special menu for passengers ahead of the Chaitra Navratri.

ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. వారికోసం స్పెషల్ సదుపాయం.!

Posted: 04/01/2022 10:41 PM IST
Irctc to serve navratri special vrat thali to train passengers

భారతీయ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్సీటీసీ ) గుడ్ న్యూస్ చెప్పింది. తమ రైళ్లలో ప్రయాణించే చైత్రనవరాత్రుల భక్తులకు ఎలాంటి ఆటంకల లేకుండా వారికి కావాల్సిన విధంగా బోజనం అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు తాజా పండ్ల రసాలు.. పాల ఉత్పత్తులు, డ్రైఫూట్స్ నట్స్ సహా పలువిధాల ఆహారం అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 2 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నవరాత్రి సందర్భంగా, రైల్వేలో ప్రయాణించే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు  కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది . నవరాత్రులలో ఉపవాసం ఉండే ప్రయాణికులు ఇప్పుడు రైలులో ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఏప్రిల్ 2 నుండి IRCTC ఈ సదుపాయాన్ని ప్రారంభించనుంది .

ఈ సదుపాయం కింద ప్రయాణికులు లస్సీ, తాజా పండ్ల రసం, పండ్లు, టీ, పాల ఉత్పత్తులు, డ్రైఫ్రూట్ పుడ్డింగ్ వంటి ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక భోజనంలో ఉల్లిపాయ-వెల్లుల్లి ఉండదు. రుచికరమైన, స్వచ్ఛమైన భోజనాన్ని అందించనున్నారు. సాదా ఉప్పుకు మబదులుగా సందవ్ ఉప్పును భోజనంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఫుడ్ డెలవరికి ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణీకులు ముందుగా ఈ-కేటరింగ్ లేదా 1323కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఆర్డర్‌లు బుక్ చేసిన రెండు గంటల తర్వాత ప్రయాణీకుల సీటుకు ఫుడ్ డెలివరీ చేయబడతుంది. 300 రైళ్లలో ఈ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులు ఈ ఫాస్టింగ్ ప్లేట్ కోసం రూ.99 నుంచి రూ.250 వరకు వెచ్చించాల్సి ఉంటుందని IRCTC ప్రతినిధి ఆనంద్ ఝా తెలిపారు.

ఈ థాలీలో ప్రయాణికులు పొందే ఆహార పదార్థాలు ఇవే:

* ఆలూ చాప్
* సాబుదాన టిక్కీ
* పనీర్ మఖ్మాలి
* సబుదాన ఖిచ్డీ నవరాత్రి థాలీ
* సింగ్దానా ఆలూ పరాఠా
* అర్బీ మసాలా
* కోఫ్తా కూర
* పెరుగుతో సబుదానా ఖిచ్డీ
* సీతాఫల్ ఖీర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles