HC Orders Woman To Pay Alimony To Her Ex-Husband బార్యభర్తలిద్దరికీ భరణం వర్తిస్తోంది: బాంబే హైకోర్టు

Woman ordered to continue paying alimony to non earning ex husband by bombay hc

alimony, wife asked to pay maintenance, section 25 Hindu Marriage Act Bombay High Court, Hindu Marriage Act, civil court,teacher, maintenance, husband ,divorce decree, Section 24 and 25 of the Hindu Marriage Act, interim or permanent alimony, restitution of conjugal rights, cruelty , ill health, Bhagyashri v Jagdish, Justice Bharati Dangre, maintenance case, Husband, Hindu Marriage Act 1955, Section 24 of the Hindu Marriage Act 1955, Alimony, Civil Court, Interim Maintenance, Crime

Upholding orders passed by a local court in Maharashtra's Nanded, the Aurangabad bench of Bombay High Court has directed a woman to pay alimony to her "indigent" ex-husband. Justice Bharati Dangre of the Aurangabad bench of the High Court upheld the orders passed by the local court in 2017 and 2019.

మాజీ భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందే: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Posted: 04/01/2022 06:54 PM IST
Woman ordered to continue paying alimony to non earning ex husband by bombay hc

భార్యాభర్తలు తమ సంపారజీవితం కొనసాగించలేక విడిపోయినప్పుడు భర్త నుంచి భార్య భరణం కోరడం అందరికీ తెలిసిన విషయమే. అయితే హింధూ వివాహచట్టం ప్రకారం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భార్యలు కూడా భర్తలకు భరణం ఇవ్వాల్సిన రావడం. ఇప్పుడిదే వార్తు న్యాయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ భర్త తర భార్య నుంచి భరణం కోసం కోర్టుకెక్కి విజయం సాధించాడు. ఔరా.. ఇది వినడానికే విచిత్రంగా ఉంది అంటారా.. నిజమే.. కానీ ఈ మేరకు బాంబే హైకోర్టు కూడా భర్తకు అనుకూలంగానే తీర్పును వెలువరించింది.

మహారాష్ట్రలో జరిగిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ మహిళకు 1992లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత చదువు కొనసాగించిన ఆమె ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. అయితే, భర్త తనను వేధిస్తున్నాడని, అతడి నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2015లో ఆమె నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు ఆ భార్యభర్తలకు విడాకులు మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. తననుంచి తన భార్య విడిపోతానంటోందని, అందుకు సమ్మతం తెలిపిన అమె భర్త.. అమె విడిపోతున్నందుకు తనకు భరణం ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.

తానే తన భార్య చదవుకు దోహదపడ్డానని, అంతేకాదు అమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు కూడా తాను అహర్నిశలు కష్టపడ్డానని.. అమకు ఏ సమయానికి ఏమి కావాలో అన్ని సమకూర్చి.. అటు ఇంటి పనులు, బయటిపనులు అన్ని తానే చూసుకున్నానని, ఈ క్రమంలో అమెకు ఉద్యోగం వచ్చేవరకు తాను చిన్నాచితక పనులతో కుటుంబాన్ని పోషించానని చెప్పారు. ఇక అమెకు ఉద్యోగం రావడంతో తనను పనులు మాన్పించివేసిందని.. ఇంటిపట్టునే ఉంటున్నానని చెప్పాడు. ఇప్పుడామె విడాకాలు తీసుకుని వెళ్లిపోతే తనకు జీవనాధారం ఏమీ లేదని, కాబట్టి ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ భర్త కోర్టుకెక్కాడు. విచారించిన అదే కోర్టు భర్తకు ప్రతినెల 3 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని 2017లో ఆమెను ఆదేశించింది.

అయితే, కోర్టు ఆదేశాలను ఆమె ధిక్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమె ఇన్నాళ్లూ చెల్లించాల్సిన భరణం బకాయిల మేరకు ఆమె వేతనం నుంచి ప్రతినెల రూ.5 వేలు పక్కనపెట్టి ఆ సొమ్మును తమకు పంపాలంటూ 2019లో ఆమె పనిచేస్తున్న స్కూలు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించింది. దీంతో ఆమె నాందేడ్ సివిల్ కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. నాందేడ్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.. జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందేనని స్పష్టమైన తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay High Court  Hindu Marriage Act  Section 24  Alimony case  Mumbai  Aurangabad  Nanded  Divorce  Maharashtra  Crime  

Other Articles