Braveheart fights armed robbers in Surat, foils robbery bid దొంగలకు ముచ్చెటలు పట్టించిన యువతి.. దెబ్బకు పరార్

18 yr old surat girl fights off armed robbers all by herself to save sister

braveheart, surat braveheart, robbery, riya swain, armed robbers, injury, Ram Kabir Society, Chalthan, Kadodara GIDC police station, Surat, Gujarat, Crime

18-year old Riya Swain is no ordinary first year college student, she is a braveheart. She not only saved herself that night, but her act of bravery saved her sister from the clutches of armed assailants who she confronted in the dark after a knife was pointed at her throat, A resident of Ram Kabir Society in Chalthan of Kadodara GIDC police station limit,

అర్థరాత్రి యువతి చూపించిన చుక్కలకు.. పలాయనం చిత్తగించిన దొంగలు..

Posted: 04/01/2022 04:58 PM IST
18 yr old surat girl fights off armed robbers all by herself to save sister

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన దోపిడీ దొంగలను సివంగిలా ఎదిరించింది గుజరాత్ సూరత్​కు చెందిన 20 ఏళ్ల యువతి. ముగ్గురు దుండగులను ఒంటి చేత్తో నిలువరించింది. తనతో పాటు చెల్లి, అమ్మకు దొంగల నుంచి ఎలాంటి హాని లేకుండా కాపాడుకుంది. ఈ యువతి ధైర్యాన్ని చూసి బెంబేలెత్తిన ఆగంతుకులు పారిపోయారు. అయితే వారిని ఎదిరించే క్రమంలో యువతి చేతికి పెద్ద గాయమైంది. మొత్తం 24 కుట్లు పడ్డాయి.

మహారాష్ట్రకు చెందిన బాబూరాం కాశీనాథ్​ కుటుంబం సూరత్​లోని పల్సానా తాలుగా ఛల్తానా గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో నివాసముంటోంది. మిల్లులో పనిచేస్తున్న అతనికి మంగళవారం నైట్​ డ్యూటీ పడింది. దీంతో భార్య భారతీబెన్​, కూతుళ్లు రియా, రిచా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతడు మిల్లుకు వెళ్లాడు. అయితే ఇదే అదునుగా భావించిన దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. రాత్రి 1:30 గంటలకు కరెంట్ పోగానే తలుపు గడియ పగలగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధవుతున్న రియా ఆ సమయంలో చదువుకుంటోంది.

కరెంటు పోయినా మెలకువతోనే ఉండటంవల్ల దొంగలు ఇంట్లోకి వస్తున్నారని గమనించింది. వారి వద్ద ఆయుధాలు ఉన్నా ధైర్యంగా పోరాడింది. మొదట ఓదొంగను నిలువరించిగా.. ఆ తర్వాత మరో ఇద్దరు దొంగలు ఇంట్లోకి వచ్చారు. అందులో ఒకరు తన చెల్లి వైపు వెళ్తుండగా.. రియా బిగ్గరగా అరిచింది. దీంతో రిచాతో పాటు తల్లి భారతీబెన్​ కూడా లేచింది. ఇంతలోనే కరెంటు వచ్చింది. దీంతో దొంగలు ఇంటి నుంచి పరారయ్యారు. అయితే వారితో పోరాడే క్రమంలో అతని వద్ద ఉన్న ఆయుధం వల్ల రియా చేతికి పెద్ద గాయమైంది. ఆస్పత్రికి వెళ్లగా 24 కుట్లు పడ్డాయి.

Surat News: రియా స్థానిక కాలేజీలో బీఎస్​సీ చదువుతోంది. కళాశాలలో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఆమెకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడింది. ముగ్గురు దొంగలతో భయం లేకుండా పోరాడిన రియా ధైర్య సాహసాలను గ్రామస్థులు ప్రశంసించారు. ఘటన జరిగిన మరునాడు పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. రియా పోరాటపటిమను కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles