Migrant Labour dies as his mobile Phone electrifies ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా విద్యుద్ఘాతం..

Hyderabad 20 year old migrant labour dies as his mobile phone electrifies while charging and talking

Cell phone charging and talking, mobile phone charging and talking, Eletrification of mobile phone, Bhaskar Jyothinath, migrant labour, Assam, Cell phone, mobile phone charging, Electrician, Electrification, Shankarpally, Hyderabad, Crime

A 20-year-old migrant labour Bhasker Jyothinath, from Assam working as Electrician at Outskirts of Hyderabad at Shankerpally had died due to electrification, as he kept his mobile Phone Charging and was talking. Due to Electrification his hands and ears tuned black.

ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా విద్యుద్ఘాతం.. వలస కూలీ మృతి

Posted: 03/30/2022 12:06 PM IST
Hyderabad 20 year old migrant labour dies as his mobile phone electrifies while charging and talking

మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరం. ఓస్ పెద్ద ప్రమాదమేమీ లేదు. ఎందుకంటే ఇలా చాలాసార్లు చార్జింగ్ పెట్టి మాట్లాడాను అని అనుకుంటున్నారా.? అయితే ప్రమాదం అన్నది చెప్పి రాదు. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రమాదం అన్నది జరిగిన తరువాత తప్పును దిద్దుకోవాలని భావించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోతుంది. ఇదే విషయాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నా, అలా ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చినా జనం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఫలితంగా ఉత్తపుణ్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని శంకరపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన భాస్కర్ జ్యోతినాథ్ (20) రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ శంకర్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో చేతులు, చెవులు కాలిపోయాయి. వెంటనే స్నేహితులు అతడిని శంకర్‌ప్లలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles