Anand Mahindra impressed with cyclist’s talent ‘ఎందరో యువతలో నైపుణ్యం ఉంది.. కానీ..’: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Built in gyroscope in body anand mahindra posts video of human segway

anand mahindra, cyclist’s talent, Built In Gyroscope In Body, Human Segway, Prafull MBA Chai Wala, Twitter, Viral Trending, man holding clothes over his head with his hands and pedalling a bicycle, cyclist’s talent, Man riding bicycle without using hands, weird news, anand mahindra reaction, Mahindra Group, Twitter, social media, viral video

Industrialist Anand Mahindra, who is known for sharing interesting and witty posts on social media, took to Twitter to share a video by Prafull MBA Chai Wala. The video shows a man holding clothes over his head using his hands and riding a bicycle. The cyclist is pedalling on a narrow road near a village and taking turns effortlessly without using his hands. One can notice his focus on holding the bundle of clothes.

ITEMVIDEOS: ‘ఎందరో యువతలో నైపుణ్యం ఉంది.. కానీ..’: ఆనంద్ మహీంద్రా ట్వీట్

Posted: 03/29/2022 05:02 PM IST
Built in gyroscope in body anand mahindra posts video of human segway

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన. ఈ వీడియోలకు తనదైన కోటేషన్ లను ఇవ్వడం లేదా తన అలోచనలు ఇమడ్చడంతో వాటికి ఆయన మార్కు తగలగానే అవికాస్తా వైరల్ గా మారిపోతుంటాయి. ఇటీవల ఐఐటీ చెన్నైకి చెందిన విద్యార్థుల 3డి ఇళ్ల నిర్మాణ సృజనాత్మకతకు ముగ్దుడైన తనకు చోటుకల్పిస్తే సంతోషిస్తానని అన్నారు. ఇటీవల సైకిల్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ రూపోందించిన గురు సౌరబ్ కు కూడా అండగా వుంటానని ప్రోత్సహించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించి వెన్నుతట్టడం ఆయన ప్రత్యేకత.

అలాంటి ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసి.. అవేదనను వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి నైపుణ్యం కలిగిన వారెందరో వున్నావారికి గుర్తించి తగు శిక్షణలేక మిగిలిపోవడంపై ఆయన అవేదన చెందారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. అందులో సైకిల్‌ నడిపే వ్యక్తి హ్యాండిల్స్‌ వదిలేసి తలపై బరువైన మూట పెట్టుకుని ఎంతో సూనాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ వీడియో చూసిన ఆనంద్‌ మహీంద్రా బరువెక్కిన హృదయంలో తన స్పందన తెలిపారు.

ట్విట్టర్‌లో ఈ వీడియోపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ ఈ వ్యక్తి ఓ హ్యుమన్‌ సెగ్వేలా ఉన్నాడు. జైరోస్కోప్‌ అతడి వంటిలోనే ఉన్నట్టుగా బ్యాలెన్స్‌ చేస్తున్నాడు. బ్యాలెన్స్‌ చేయడంలో అతడికి ఉన్న సెన్స్‌ నమ్మశక్యం కానిదిగా ఉంది. అయితే ఈ వీడియో చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. ఇండియాలో టాలెంట్‌ కలిగిన వారెందరో ఉన్నారు. వీరంతా మంచి జిమ్నాస్టులుగా స్పోర్ట్స్‌ పర్సన్స్‌గా మారాల్సిన వాళ్లు. కానీ వీళ్లు వెలుగులోకి రాలేక శిక్షణ పొందలేకపోతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో ఆకట్టుకునేలా ఉండటం దానిపై ఆనంద్ మహీంద్రా స్పందన మన దేశంలోని పరిస్థితికి అద్దం పట్టేలా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తుండగా మరికొందరు ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలంటూ సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles