Irani Chai price hiked by Rs 5 from today కరోనా ఎఫెక్ట్: ఇరానీ చాయ్.. ధర పెరిగింది భాయ్..

Coronavirus effect irani chai prices hiked by irani hotel association

Irani chai, price hike, Irani Chai Hotels Association, Hyderabad Irani chai, Irani Chai at Rs. 20, Rs 5 hiked in Irani chai, Hyderabad, Telangana

Irani chai Hotels Association of Hyderabad has hiked the prices of Irani Chai by Rs.5. Presently a Cup Irani chai is served at Rs.15, had been raised to Rs.20. The increased prices came into force since morning.

కరోనా ఎఫెక్ట్: ఇరానీ చాయ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ధర పెరిగిందీ భాయ్..

Posted: 03/25/2022 03:19 PM IST
Coronavirus effect irani chai prices hiked by irani hotel association

ఏ  ఛాయ్  చాయ్  చటుక్కున  తాగరా  భాయ్.. ఈ  ఛాయ్  చమక్కులే  చూడరా  భాయ్.. ఏ  ఛాయ్  ఖరీదులో  చీపురా  భాయ్.. ఈ  ఛాయ్  ఖుషీలనే  చూపురా  భాయ్ ఏ  ఛాయ్  గరీబుకు  విందురా  భాయ్.. అంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు చిత్రంలోనిదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటలోని మూడో లైనులోనే ప్రస్తుతం మార్పులు వచ్చేశాయి. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్.. అని ఇకపై భాగ్యనగరవాసులు అనే పరిస్థితి లేదు. కరోనాకు ముందుకు ఉన్న ధరకు ప్రస్తుత ధరకు దాదాపుగా రెట్టింపు మేర ధర పెరిగింది.

అంతేకాదు.. ఇప్పటివరకు భాగ్యనగరవాసుల్లోని చాలా మందికి ఛాయ్.. బిస్కట్ అల్పాహారంగా కూడా మారింది. కానీ ఇకపై ఈ చాయ్ బిస్కట్ కూడా గరీబుకు దూం కానుంది. ఏ  ఛాయ్ గరీబుకు విందురా భాయ్.. అన్న వ్యాఖ్యం కూడా పూర్తిగా మారిపోనుంది. అంతకుముందు ప్రతీ ఇరానీ ఛాయ్ హోటల్ లో పూరీని అరగించి ఛాయ్ తాగే పేదలు.. తమ అల్పాహారం ముగిసిందనుకునేవారు. ధరల ప్రభావంతో క్రమంగా పూరీ కూడా కానరాకుండా పోయింది. అక్కడక్కడ దర్శనమిచ్చినా.. వాటిని తినేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో హోటళ్ల యాజమాన్యాలు వాటిని తొలగించాయి. దాని స్థానంలో బిస్కెట్ వచ్చి చేరింది.  

ఇక తాజాగా ఇరానీ చాయ్‌ ధర మళ్లీ పెరగడంతో.. బిస్కెట్ కు కూడా స్వస్తి పలికి కేవలం చాయ్ తోనే పేదలు తమ అల్పాహారం అయ్యిందని అనిపించుకునే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే భాగ్యనగరంలో ఇరానీ చాయ్‌ మరింత ప్రియం కానుంది. ఒక కప్పు ఛాయ్‌పై ఏకంగా రూ. 5 పెంచుతున్నట్లు హోటల్‌ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇరానీ చాయ్‌ రూ. 15 నుంచి రూ. 20కు చేరుకుంది. పెరిగిన ధరలు మార్చి 25 నుంచి అమలులోకి వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

క్రూడాయిల్‌ ధరల ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇప్పటికే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ప్యాకేజ్డ్‌ వస్తువులను భారీగా పెంచాయి. ఇక ద్రవ్యోల్భణ ఒత్తిళ్లను అధిగమించడానికి మరోమారు 10-15 శాతం వరకు ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్దమైన్నాయి. ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా రాకతో హోటళ్ల నిర్వహణ మరింత కష్టంగా మారింది. హోటళ్ల బిజినెస్‌ పూర్తిగా దెబ్బతింది. ఇక లాక్ డౌన్ అనంత‌రం అస‌లు వ్యాపారం సాగ‌డం లేదని యజమానులు పేర్కొన్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.  భారీ నష్టాల నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని హోటల్‌ యాజమానులు తెలిపారు. క‌రోనాకు ముందు ఒక క‌ప్పు  ఇరానీ చాయ్ ధ‌ర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles