Transformer blast kills man, daughter in Bengaluru పెళ్లింట్లో తీవ్ర విషాదాన్ని నింపిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్..

Bescom negligence transformer blast kills man daughter in bengaluru

Shivaraj, Chaitanya, Father, daughter, Bangalore Electricity Supply Company (Bescom), Manganahalli bridge, Daughter’s engagement, convention hall, nice road, transformer blast, transformer blast claims two lives, father and daughter died, Bescom negligence, bengaluru news, Karnataka, Crime

A 55-year-old man died in a transformer blast close to the Manganahalli bridge near NICE Road in Jnanabharathi limits of South Bengaluru on ednesday. His 19-year-old daughter, Chaitanya, who was battling for life with severe burns at Victoria Hospital, succumbed to injuries on Thursday.

పెళ్లింట్లో విషాదం.. పేలిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్.. తండ్రి, తనయ మృతి

Posted: 03/24/2022 12:19 PM IST
Bescom negligence transformer blast kills man daughter in bengaluru

కర్ణాటక, బెంగళూరులో హృదయవిదారక సంఘటన జరిగింది. ఎదిగిన కూతురికి పెళ్లి చేయాలని చక్కని సంబంధం చూసిన తండ్రి.. ఇక త్వరలో ఎంగేట్ మెంట్ నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న కల్యాణ మండపం బుక్ చేసి తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో రోడ్డు పక్కన ట్రాన్స్​ఫార్మర్ పేలి అతని ప్రాణాలను బలితీసుకుంది. తీవ్రగాయాలపాలైన అతని కూతురు కూడా అసుపత్రిలో చికిత్స పోందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దీంతో కర్ణాటకలోని మంగనహళ్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, తనయల ప్రాణాలు పోవడానికి బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కమ్) నిర్క్లక్యమే కారణం.

వివరాల్లోకి వెళ్తే.. మంగనహళ్లి ప్రాంతంలోని ఉళ్లాల్ లో నివసించే శివరాజ్​(55).. ఇటీవల తన కూతురు చైతన్య (25)కు వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నారు. త్వరలోనే నిశ్చితార్థం చేయాలని ఇరు తరపువారు నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక మంగనహళ్లిలో ఉన్న కన్వెన్షన్ హాలును బుక్ చేసుకునేందుకు తన కూతురుతో కలసి వెళ్లిన శివరాజ్.. హాలు బుక్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడున్న వంతెను దాటి.. రోడ్డు మరోవైపు దాటడానికి స్కూటీని రోడ్డు పక్కనే ఆపాడు. ఆ సమయంలోనే అక్కడ ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ ఒక్కసారిగా పేలింది. ట్రాన్స్​ఫార్మర్​లోని ఆయిల్ చిల్లి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి పరిస్థితి విషమంగా మారింది.

ఈ ఘటనతో స్థానికులు ఓక్కాసారిగా అలర్ట్ అయ్యి వారిని స్థానికి విక్టోరియా అసుపత్రికి తరలించారు. కాగా, సుమారు 80శాతం మేర కాలిన గాయాలతో శివరాజ్ కొద్దిసేపటికే మరణించగా, అర్థరాత్రి సమయంలో ఆయన కూతురు చైతన్య కూడా మరణించారు. స్థానికంగా చాలా రోజులుగా ఆ ట్రాన్స్​ఫార్మర్​ నుంచి ఆయిల్ కారుతుందని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యుత్ సంస్థ కంపెనీ సిబ్బంది స్పందించలేదని.. దీంతోనే ఇప్పుడు పెళ్లింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుందని స్థానికులు అరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles