Boy pretends as girl to use Free bus Facility, caught ఉచిత బస్సులో తిరగాలని లేడీ గెటప్.. పసిగట్టిన కండక్టర్..

Man disguised as woman using free ticket service caught by conductor

delhi, delhi transport, delhi transport corporation, delhi bus, delhi bus service, free bus, free bus service, bus funny video, bus funny moments, without ticket, bus viral video india, bus conductor, bus conductor funny video, man disguised as woman, man posing as woman, man disguised as girl, memes, funny videos, funny moments, viral, viral video, social viral video

A Man who was disguised as a Girl was caught by Bus conductor getting free bus ride in Delhi. Actually Women/Girls in Delhi get free rides in public buses as the Delhi government has sanctioned this facility for all Girls/Women who reside in Delhi.

ITEMVIDEOS: ఉచిత బస్సులో తిరగాలని లేడీ గెటప్.. పసిగట్టిన కండక్టర్..

Posted: 03/24/2022 11:27 AM IST
Man disguised as woman using free ticket service caught by conductor

ఢిల్లీలో బస్సులో ఉచితంగా తిరగాలని తాను అనుకున్న చోటకి వెళ్లి మళ్లీ అలానే ఇంటికి చేరుకోవాలని ఓ యువకుడు వేసిన ప్లాన్ ఎలా బెడిసికోట్టిందో తెలుసా.? అతడ్ని బస్సు కండక్టర్ ఎలా పట్టుకున్నాడో తెలుసా.? దీంతో అతడి గుట్ట కాస్తా రట్టు కావడమే కాదు.. యావత్ సమాజానికి తెలిసిపోయి.. పరువుపోయింది. అదెలా అంటే దేశరాజధాని ఢిల్లీలో మహిళలు, యువతులు, బాలికల కోసం ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ గత మూడేళ్లుగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నాడు.

అయితే తన వద్ద డబ్బులు వున్నాయో.. లేదో.. లేక ఆ డబ్బులను తన అవసరాలకు వాడుకుని ఇలా తన గెటప్ మార్చి ఎప్పట్నించి తిరుగుతున్నాడో తెలియదు కానీ.. ఓ యువకుడు ఏకంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు గాను ఆడపిల్ల వేషం వేసుకున్నాడు. అందుకు గాను ముఖానికి మాస్కు, చున్నీతో స్క్రాప్ కట్టుకుని బస్సు ఎక్కాడు. అతడు ఎక్కడంతోనే కండక్టరుకు అనుమానం వచ్చింది. యువతులైతే బస్సును కాసింత వయ్యారంగా ఎక్కుతారు, కానీ ఈ గెటప్ యువతి మాత్రం యువకుడిలానే బస్సును ఎక్కింది.

దీంతో కండక్టరుకు అనుమానం వచ్చింది. కాసింత గట్టిగానే అతను గద్దించడంతో యువకుడి బంగారం కాస్తా బట్టబయలైంది. అదెలా అంటే ఏయ్ ముఖానికి పెట్టుకున్న మాస్కు తీసేయ్ అని గద్దించాడు. లేదంటే ట్రాన్స్ పోర్టు అధికారులకు ఫోన్ చేస్తాను.. వారు పట్టుకుంటే ఏకంగా ఫైన్ తో పాటు జైలే అని బెదరించాడు. అంతే కండక్టరు బెదిరింపులకు యువకుడు తలోగ్గాల్సి వచ్చింది. వెంటనే మాస్కును తీసాడు. అంతే యువకుడు యువతి వేషంలో వచ్చాడని గుర్తించాడు. అతడ్ని తతంగానంతా వీడియోలో షూట్ చేసి.. నెట్టింట్లో పెట్టాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ చూడండీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles