COVID-19 pandemic is 'far from over' -WHO official కరోనా ఫోర్త్ వేవ్ పై హెచ్చరించిన డబ్యూహెచ్ఓ

Covid 19 fourth wave coming china reports 2 deaths first in more than one year

Omicron-driven Covid outbreak, Covid, Covid-19 cases, China, south Korea, omicron, south korea, vietnam, seoul, COVID-19, china, coronavirus, Lockdown, Omicron, China new covid cases, Coronavirus, World Health Organization, u.n., margaret harris, health news, geneva, covid 19

A World Health Organization spokesperson said that the end of the COVID-19 pandemic was a long way off, citing a rise in cases in its latest weekly data. The U.N. health agency has previously said that the acute phase of the pandemic could end this year but it would depend on how quickly we meet its target to vaccinate 70% of the population in each country, among other factors.

చైనా, దక్షిణ కొరియాలో కరోనా విజృంభణ.. ఫోర్త్ వేవ్ పై హెచ్చరించిన డబ్యూహెచ్ఓ

Posted: 03/19/2022 11:40 AM IST
Covid 19 fourth wave coming china reports 2 deaths first in more than one year

చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సరికొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ దడ పుట్టిస్తోంది. దీనికి తోడు దాదాపు ఏడాది కాలం తర్వాత చైనాలో కరోనా మరణాలు కూడా సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్ లో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇక చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో లక్షణాలతో కూడిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమవుతోంది. కఠిన ఆంక్షలను విధిస్తోంది. ఇటీవల కనీసం 10 నగరాల్లో లాక్ డౌన్ విధించింది.

ఇక ఇదే సమయంలో అటు దక్షిణ కొరియాలో కూడా అదే తరహాలో ఈ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రోజువారిగా 6 లక్షల కేసుల రికార్డును నమోదు చేసింది. దీంతో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని వైద్యులు చెపుతున్నారు. జూన్, జులై మాసాల్లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరోమారు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ అరోగ్య సంస్థ డబ్యూహెచ్ఓ అప్రమత్తమైంది. వైరస్ ఇంకా బలంగానే ఉందని, మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

వైరస్ పూర్తిగా క్షీణించలేదని, సీజనల్ వ్యాధిలా మారలేదని స్పష్టం చేసింది. మున్ముందు మరిన్ని కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా తగ్గుముఖం పట్టిందని, కాబట్టి సులభంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. యూకేలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిన తర్వాత అక్కడి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది చేరుకుంటుందన్నారు. కాబట్టి దానిని సమూలంగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టకపోతే మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles