Goon Surrenders With Placard: 'don't Shoot Me' ‘నన్ను కాల్చొద్దు, ప్లీజ్..’: ప్లకార్డుతో పోలీసులకు లొంగిపోయిన గూండా

Goon surrenders with placard in uttar pradesh don t shoot me

Gautam Singh, Chhapia police station, chicken-feed trader, abduction case, Santosh Mishra, Lucknow, yogi adityanath, placard, goon, gonda, bjp, accused’s dramatic surrender, abduction case, social media, Viral video, Uttar pradesh, Crime

In a re-run of the spate of surrenders by criminals fearing police encounters after Yogi Adityanath stormed to power in 2017, a man accused of abduction and carrying of a bounty of Rs 25,000 gave himself up at a police station in Gonda— in the first such surrender after BJP swept to victory five days ago. The video of the accused’s dramatic surrender went viral on social media.

‘నన్ను కాల్చొద్దు, ప్లీజ్..’: ప్లకార్డుతో పోలీసులకు లొంగిపోయిన గూండా

Posted: 03/16/2022 09:31 PM IST
Goon surrenders with placard in uttar pradesh don t shoot me

పోలీసులు ఎక్కడ ఎన్ కౌంటర్ చేసి చంపేస్తారోనని ఉత్తరప్రదేశ్ లోని నేరస్థులు, గూండాలు గజగజ వణికిపోతున్నారిప్పుడు. ఆ భయంతోనే పోలీసులకు లొంగిపోతున్నారు. మామూలుగా అయితే, ఫర్వాలేదుగానీ.. కొందరు గూండాలు తమను షూట్ చేయొద్దు, ప్లీజ్.. లొంగిపోతామంటూ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. కిడ్నాపుల కేసుల్లో నిందితుడు, తలపై రూ.25 వేల రివార్డు ఉన్న గౌతమ్ సింగ్ అనే గూండా అదే చేశాడు.

‘‘నన్ను చంపవద్దు. కాల్చి ఎన్ కౌంటర్ చేయొద్దు, ప్లీజ్. నేను లొంగిపోతాను’’ అనే ప్లకార్డును మెడలో వేసుకుని నేరుగా ఛాపియా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 7న ఒక చికెన్ వ్యాపారిని గౌతమ్ సింగ్ కిడ్నాప్ చేశాడని, రూ.20 లక్షలివ్వాలంటూ అతడి కుటుంబానికి ఫోన్ చేసి డిమాండ్ చేశాడని గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా చెప్పారు. 

అతడికి సహకరించిన జుబైర్, రాజ్ కుమార్ యాదవ్ లను అరెస్ట్ చేశామని, గౌతమ్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టి రూ.25 వేల నజరానా ప్రకటించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో తన సోదరుడు అనిల్ తో కలిసి గౌతమ్ లొంగిపోయాడని సంతోష్ మిశ్రా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles