Police help otters cross busy road in Singapore నీటి కుక్కల కోసం ట్రాపిక్ నిలిపివేత

Watch singapore traffic police help a family of adorable otters cross a road

local otters, otters crossing a busy road, multilane road, Singapore road, Singapore police, Singapore’s presidential palace, Istana staff, safe passage of otters, policeman guarded otters cross road, Singapore Prime Minister, Lee Hsien Loong, social media, viral video, video viral

A video has gone viral on social media for all the right reasons. The video shows otters crossing a busy Singapore road with the help of police. The video was reportedly taken on a multilane road outside Singapore’s presidential palace. Vehicles stopped for their safe passage as a policeman guarded the otters while they crossed the road.

ITEMVIDEOS: నీటి కుక్కలను రోడ్డు దాటేందుకు.. రద్దీ రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేత..

Posted: 03/15/2022 09:29 PM IST
Watch singapore traffic police help a family of adorable otters cross a road

నీటి కుక్కలు.. ఈ పదమే మనకు కాసింత కొత్తగా అనిపిస్తోంది. భూమి మిద తిరిగే కుక్కలు మనకు తెలుసుకానీ.. నీటిలోనూ కుక్కలు ఉంటాయా.? అన్న ఆశ్చర్యం కూడా కొందరిలో వ్యక్తంకాక మానదు. అయితే విదేశాలు అందులోనూ సింగపూర్ వంటి దేశాలు పర్యటించిన వారికి మాత్రం ఇవి బాగానే తెలుసు. ఎందుకంటే అక్కడ నీటి కుక్కలు సహజంగా కనిపిస్తుంటాయి. కానీ మన వద్ద మాత్రం విశ్వాసపాత్రమైన గ్రామసింహాలే దర్శనమిస్తుంటాయి. మన దేశంలో ఈ వీధి శునకాలు రద్దీ రోడ్డు క్రాస్ చేయాలంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే.

అలాగే సింగ‌పూర్ లోనూ రద్దీగా ఉండే రోడ్డును అక్కడి నీటికుక్కలు దాటాల్సివచ్చింది. ఇస్తానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిత్యం రద్దీగా వుంటే రోడ్డుపైకి అవి ఒక్కసారిగా వచ్చాయి. వాటిని చూసిన పోలీసులు.. అవి ఎక్కడికో వెళ్లాలని రోడ్డు వెంట వచ్చాయని గ్రహించాడు. అయితే రోడ్డుపై రద్దీగా వెళ్తున్న వాహనాల మధ్య అవి వెళ్లలేవని.. వెళ్లినా ప్రమాదాల బారిన పడే అవకాశాలు వున్నాయని తెలుసుకున్న పోలీసులు.. వెంట‌నే రోడ్డుపై వెళ్తున్న ట్రాఫిక్‌ను నిలిపేశారు. నీటి కుక్కలు రోడ్డు దాటేవ‌ర‌కూ ట్రాఫిక్‌ను నిలిపేసి మాన‌వ‌త్వాన్ని చాటారు.

ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ వీడియోలో మ‌ల్టీలేన్ రోడ్డుకిరువైపులా వాహ‌నాలు నిలిచిపోయాయి. ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డు మ‌ధ్య‌లో నిల్చుండ‌గా 16 నీటికుక్క‌లు సుర‌క్షితంగా రోడ్డు దాటాయి. ఈ స‌న్నివేశాన్ని డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి, సోష‌ల్‌మీడియాలో పెట్టాడు. ఈ వీడియోను సింగ‌పూర్ ప్ర‌ధాన‌మంత్రి లీ హ్సీన్ లూంగ్ షేర్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల‌ను అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles