Critically endangered sawfish netted off Karnataka coast మత్య్సాకారుల వలలో అంతరించిపోతున్న రంపం చేప..!

Critically endangered sawfish netted off karnataka coast fishermen reportedly auction it

carpenter shark, saw fish, Malpa, Udupi, Karnataka, carpenter shark caught in fishing net, shark video, India, Fishing, Sawfish, Endangered Species, Nature, Wildlife, Endangered

A sawfish, considered a critically endangered species protected under Schedule 1 of the Wildlife (Protection) Act 1972, was accidentally netted by fishermen in Malpe on Thursday. Though it could not be verified immediately, the fish was allegedly auctioned.

కర్ణాటక మత్య్సాకారుల వలలో అంతరించిపోతున్న రంపం చేప..!

Posted: 03/15/2022 05:15 PM IST
Critically endangered sawfish netted off karnataka coast fishermen reportedly auction it

సముద్రంలో అనంతకోటి జీవరాశులు వున్నాయన్న మాటే కాని.. వాటిని చూసింది మాత్రం లేదు. అప్పడప్పుడు వార్తల్లో కొన్ని అరుదైన చేపల గురించి వింటుంటాం. అలాంటి క్రమంలోనే ఇటీవల అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుడ్ని ఓ అరుదైన చేప దూసుకోచ్చి చంపేసిన విషయం తెలిసిందే. అయితే అది కొమ్ము చేప అని మన సముద్రంలో అత్యంత అరుదుగా కనిపిస్తాయని.. అలాంటి చేప కనిపించడంతో మత్య్సకారుడు సముద్రంలోకి దూకి దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుని.. వేగంగా తిరిగి వచ్చి మత్స్యకారుడి పోట్టలో దూసుకెళ్లిన ఘటన తెలిసిందే.

అయితే తాజాగా కర్ణాటకలో మాత్రం మత్య్సకారుల వలలో అత్యంత అపురూపమైన రంపం చేప చిక్కింది. అయితే అప్పటికే ఇది మరణించింది. ఈ జాతి చేపలు పూర్తిగా అంతరించి పోతున్న క్రమంలో ఈ చేప చిక్కడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని ఉడుపి పరిధిలోని పమాల్పీలో ఫిషింగ్ నెట్స్లో చాలా అరుదైన సా పిష్ (రంపపు చేప) పట్టుబడ్డింది. దీనిని కార్పెంటర్ ఫిష్ అని కూడా పిలుస్తారు, ఒక క్రేన్లో భారీ చేపల మృతదేహాన్ని చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తోంది. 250 కేజీలున్న చేపను జాలర్లు బోటులో తీసుకురాగా, మంగళూరుకు చెందిన ఓ వ్యాపారి దీనిని ఖరీదు చేశాడు. దీంతో దానిని మంగళూరుకు తరలించారు. చేప నోరు ఏకంగా 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles