Janasena meeting venue crowded with fans జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న సైనికులు

Pawan kalyan to unveil jana sena s future plans in amaravati

Pawan Kalyan, Jana Sena, Gannavaram Airport, Jana Sena public meeting, Jana Sena Formation Day, 2024 andhra pradesh assembly elections, jana sena, pawan kalyan jana sena, amaravati, andhra pradesh politicsAndhra News, Andhra Pradesh, Politics

Jana Sena president Pawan Kalyan will be addressing a public meeting in Mangalagiri constituency on the occasion of the party’s 9th anniversary. The party is all set to reveal its political plans in Andhra Pradesh at its ninth formation day celebrations. Jana sainiks and pawan kalyna fans already arrived in a large number at the venue.

జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు భారీగా త‌ర‌లివ‌చ్చిన జ‌న సైనికులు

Posted: 03/14/2022 12:41 PM IST
Pawan kalyan to unveil jana sena s future plans in amaravati

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోన్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్ప‌టికే నేతలు పూర్తిచేశారు. సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణం నిండిపోయింది. ఆ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌సేన పాక్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సహా ఇతర పార్టీ అగ్రనేతలు ఇత‌ర నేత‌లు ప‌రిశీలించారు. పార్టీ ఆవిర్భావ స‌భ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్ప‌టికే మంగళగిరి చేరుకున్నారు. మ‌రో గంట‌లో ఆయ‌న ఇప్ప‌టంకు బ‌య‌లుదేర‌నున్నారు.

వ‌చ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సభ నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌సేన‌ ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్త‌యి తొమ్మిదో ఏట అడుగుపెడుతున్న నేప‌థ్యంలో భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేశారు. 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో సభా ప్రాంగణం నిర్మిత‌మైంది. వ‌చ్చిన జ‌నం అంతా సభా కార్యక్రమాలను చూసేందుకు వీలుగా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచి త‌మ పార్టీ భవిష్యత్‌ ప్రణాళికను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్రకటిస్తారని జ‌న‌సేన నేతలు మీడియాకు తెలిపారు.

అలాగే, టీడీపీతో పొత్తుపై కూడా ఈ స‌భ ద్వారా సూచ‌న‌లు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై త‌మ వైఖ‌రిని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలప‌నున్నారు. త‌మ‌ పార్టీపరంగా అనుసరించే విధానాలను వివరించే అవకాశం ఉండ‌డంతో దీనిపై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ విశాఖ సిటీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకుంది. దీంతో ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి ఊహించ‌ని స్థాయిలో స్పందన వ‌స్తోంది. కొంద‌రు బ‌స్సులు, కార్ల‌లో నినాదాలు చేస్తూ స‌భా ప్రాంగ‌ణానికి వెళ్తున్నారు.  

ఇప్పటం సభావేదిక వద్ద వెలసిన ఆసక్తికర పోస్టర్..

ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతోన్న సభావేదిక సమీపంలో ఓ ఆసక్తికర పోస్టర్ వెలిసింది. ఈ పోస్టర్ ద్వారా ఇప్పుటి వరకు దాదాపుగా రాష్ట్ర ప్రజలు మర్చిపోయిన ఓ వ్యక్తిని మళ్లీ జనసైనికులు గుర్తుచేశారు. ఆయనే జ‌న‌సేన అసంతృప్త ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. ఈ స‌భ‌లోకి ఆయనకు ప్ర‌వేశం లేద‌ని అందులో తెలియజేస్తూ... 'ఇట్లు మీ ప‌ల్ల‌కి మోసిన రాజోలు జ‌న‌సైనికులు' అని పేర్కొన్నారు. కాగా, జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వ‌ర ప్ర‌సాద్ అనంత‌రం ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీకి మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు వ్యతిరేకంగా జనసేన కార్య‌క‌ర్త‌లు ఈ పోస్ట‌ర్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles