Terrorist killed in encounter with security forces in J&K జమ్మూలోని పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం..

Terrorist killed in encounter with security forces in j k s pulwama

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Pulwama encounter, Naina Batpora encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, Budgam encounter JK, Jammy encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Pulwama, Jammu and Kashmir, National politics

An encounter has broken out between terrorists and security forces at Naina Batpora area in South Kashmir's Pulwama district of Jammu and Kashmir, police informed on Thursday (March 10). One terrorist has also been killed by the security forces in Pulwama.

జమ్మూలోని పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం..

Posted: 03/10/2022 02:28 PM IST
Terrorist killed in encounter with security forces in j k s pulwama

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు.. ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. రాష్ట్రంలోని దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోగల పుల్వామా జిల్లాలోని ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో భద్రత బలగాలు ఉగ్రవాదిని హతమార్చాయి. వుల్వామా జిల్లాలోని నైనా బట్‌పోరాలో ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారం అందుకన్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుపగా.. ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

కాగా ఈ నైనా బట్‌పోరాలో ప్రాంతంలో ఇప్పటికీ ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. పుల్వామా జిల్లాలోని నైనా బట్‌పోరాలో ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉండగా భద్రతా బలగాలు మాత్రం వారిని లొంగిపోవాలని సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదలు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. భద్రతా దళాలతో కలసి నైనా బట్‌పోరా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలపైకి ముష్కరులు కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో హుటాహుటిన స్పందించిన భద్రతా దళాలు వారిపైకి ప్రతిదాడులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించారు. అయితే స్థానికంగా ఇంకా కోందరు ఉద్రగవాదుల నక్కివున్నారు. దీంతో వారిని ఓ వైపు లొంగిపోవాలని భద్రతా బలగాలు సూచిస్తూనే.. మరోవైపు కాల్పులు జరుపుతున్నవారిపై కాల్పులతోనే సమాధానం చెబుతున్నాయి.

పుల్వామా జిల్లాలోని నైనా బట్పోరా ప్రాంతంలో అనుమానిత వ్యక్తులను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బృందం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ క్రమంలోనే బలగాలను గమనించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ ఫోర్స్‌పై కాల్పులకు దిగాయి. దీంతో బలగాలు కాల్పులు జరగ్గా.. ఓ ఉగ్రవాది మరణించాడని, ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని స్థానిక పోలీస్‌ అధికారులు తెలిపారు. ఇక పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఉగ్రమూకలు ముందుగా కాల్పులకు తెగబడిన పరిస్థితుల్లో భారత భద్రతా బలాగాలు కూడా కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles