Assembly Results: AAP heads for big win in Punjab పంజాబ్ లో అప్ ప్రభంజనం.. మట్టికరుస్తున్న మహామహులు

Aap heading to landslide victory cong sad decimated sidhu cm channi badals amarinder trailing

Punjab Assembly Election, Punjab Elections Trends, Bhagwant Mann, Punjab results 2022, Punjab election results, Congress, AAP, BJP, sad, Navjot Singh Sidhu, Charanjit Singh Channi, Bhagwant Mann, Captain Amarinder Singh, Shiromani Akali Dal (SAD), Prakash singh Badal, Punjab Election results, Punjab, Politics

Counting of votes is underway for 117 assembly seats in Punjab. The Arvind Kejriwal-led AAP, which emerged as a major contender in the multi-cornered contest, is looking to get its first full state to rule. With the AAP leading in more than 87 seats in the 117-seat Punjab Assembly on the road to victory, many prominent candidates are trailing to Aam Aadmi party candidates.

పంజాబ్ లో అప్ ప్రభంజనం.. మట్టికరుస్తున్న మహామహులు

Posted: 03/10/2022 10:49 AM IST
Aap heading to landslide victory cong sad decimated sidhu cm channi badals amarinder trailing

భూర్జువా పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించి.. సామాజిక కార్యకర్త, స్వతంత్ర సమరయోధుడు అన్నా హజారే అవినీతి రహిత భారత ఉద్యమం తరువాత ఆయన ఆలోచనల ద్వారా పురుడు పోసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అమ్ అద్మీ పార్టీ (ఆప్) తొలిసారి పూర్తి స్థాయి రాష్ట్రంలో అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ఇక్కడి తాము ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే పథకాలు, సంక్షేమాలు, అవినీతి అంతానికి రూపకల్పన, రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధరలు, యువత ఉపాధి, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీలో అధికారంతోనే తన మార్కు ప్రభుత్వ పాలనను దేశరాజధాని ప్రజలకు అందించి.. వారి చేత ఔరా అనిపించేలా చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అప్ పార్టీ.. ఇక పూర్తి స్థాయి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో.. ఎలాంటి ప్రభుత్వ పాలనను అందిస్తోందన్న ప్రజలకు రానున్న ఐదేళ్ల కాలమే జవాబులను అందిస్తుంది. ఈ పాలనతో యావత్ దేశంలోని మిగతా రాష్ట్రాలలో తమ పార్టీని విస్తరింపజేసేందుకు కూడా ఇది దోహదం చేస్తోంది. ఇప్పటికీ కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు అప్ పార్టీని పిల్ల కూనగా అభివర్ణించినా.. తాను మాత్రం పిల్లకూన కాదు.. పులి పిల్లననని మరోమారు అప్ రుజువుచేసుకుంది.

అందుకు నిదర్శనంగా నిలిచిన పంజాబ్ ఎన్నికలలో అనేకమంది ప్రత్యర్థి పార్టీల రాజకీయ దురంధులను కూడా వెనక్కునెట్టి తమపార్టీ అభ్యర్థుల ముందంజలోకొనసాగుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ, పంజాబ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాళీదళ్ పార్టీ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూలు వెనకంజలో ఉన్నారు. ఇక నవజ్యోత్ సింగ్ సిద్దూ మాత్రం ఏకంగా మూడవ స్థానంలో కోనసాగుతున్నాడు. ఇక తన సొంత నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగడం నమ్మలేని చరణ్ జీత్ సింగ్ చన్నీ రీ-ఎలక్షన్స్ కు పట్టుబడుతున్నాడు.

రెండు సార్లు పంజాబ్ సీఎంగా చేసిన అమ‌రీంద‌ర్ సింగ్‌.. ఇవాళ జ‌రుగుతున్న కౌంటింగ్‌లో వెనుకంజ‌లో ఉన్నారు. పాటియాలా అర్బ‌న్ నుంచి ఆయ‌న పోటీలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక శిరోమ‌నీ అకాలీద‌ళ్ నేత ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కూడా లంబీ స్థానం నుంచి వెన‌కంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి గుర్మీత్ సింగ్ కుదియాన్ ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. చామ్‌కౌర్ సాహిబ్‌, బ‌హ‌దూర్ అసెంబ్లీ స్థానాల నుంచి ఆయ‌న పోటీలో నిలుచున్నారు.

అయితే ఆ రెండు స్థానాల నుంచి పంజాబ్ సీఎం చ‌న్నీ వెనుకంలో ఉన్నారు. ఇక అమృత్‌స‌ర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ, సాద్ నేత బిక్ర‌మ్ మ‌జితా వెనుకంలో ఉన్నారు. భ‌టిండా అర్బ‌న్ నుంచి ఆర్థిక మంత్రి మ‌న్‌ప్రీత్ బాద‌ల్ ఓడిపోయే అవ‌కాశాలు ఉన్నాయి. పంజాబ్‌లో సెన్షేష‌న్ విక్ట‌రీ కొట్టేందుకు ఆమ్ ఫ్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకున్న‌ది. 117 స్థానాలకు గాను ఆ పార్టీ ఇప్ప‌టికే 88 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. భ‌గ‌వ‌త్ మాన్ సింగ్ సీఎం అభ్య‌ర్థిగా పంజాబ్‌లో పోటీ చేశారు. ఢిల్లీ త‌ర్వాత ఆప్ ఖాతాలో వెళ్ల‌నున్న రెండ‌వ రాష్ట్రంగా పంజాబ్ నిలువ‌నున్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles