నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నూతనంగా 80, 039 పోస్టులకు ఇవాళ్టి (మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఇకపై అగ్రవర్ణాలకు చెందిన ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుకు పెంచగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లుకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక అదే సమయంలో దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లుకు పెంచగా, ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితిని 47 ఏళ్లుకు పెంచారు. కాగా తాము పెంచిన వయోపరిమితి అన్ని శాఖల్లో వర్తించనుందని, అయితే ఇందుకు హోంశాఖకు మాత్రం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. ఇదిలావుండగా, ఈ శాఖలోనే అత్యధికంగా ఖాళీలు వున్నాయన్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధనతో ఉద్యోగాలు వస్తాయని ఆశించి.. గత ఎనమిదేళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువత ఇప్పటికే వయోపరిమితి దాటిపోగా.. ఇక అరకొరగా మిగిలిన ఇతర శాఖల ఉద్యోగాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మొత్తం 80, 039 ఖాళీల్లో.. అత్యధికంగా హోం శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందులో మాత్రం వయోపరిమితి వర్తింపు లేదు. ఇక ఆ తర్వాత స్థానంలో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12,775 ఖాళీలు ఉన్నాయి. ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్ కాస్ట్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 2,879, ఇరిగేషన్‌లో 2,692, ఫైనాన్స్‌లో 1,146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. ఇదిలా వుండగా, రాష్ట్ర డీజీపీ ఎం.మహీందర్ రెడ్డి ఉద్యోగార్థుల కోసం తాజాగా అదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని కమీషనరేట్లకు, ఎస్పీలకు ఆయన అదేశాలు చేరాయి. హోం శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అశావహులకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ అదేశాలు జారీ చేశారు. పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఆసక్తిని కనబరుస్తున్న ఆశావహ ఔత్సాహికులకు నియామకాలకు ముందే వారికి ప్రీ- రిక్రూట్ మెం్ కోచింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీసు (డీజీపీ) మహేందర్ రెడ్డి తన అదేశాలలో పేర్కోన్నారు. కమ్యూనిటీ ఎంపర్ మెంట్ కింద యువతను హోంశాఖలో ఉద్యోగాల కోసం ప్రోత్సహించేలా నైపుణ్యాభివృద్ది పోందేలా శిక్షణను కల్పించాలని సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గోన్న అభ్యర్థులందరూ విజయం సాధించేలా వారికి అధికారులు ప్రోతాహాన్ని కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటారని, అయినప్పటికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడదనేది తమ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు. కేంద్ర సర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పుకొచ్చారు. తాము క్రమశిక్షణతో పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. కొందరు ఉద్యోగ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more