Glass piece in Yadadri Pulihora prasadam యాదాద్రి పులిహోరా ప్రసాదంలో గాజుముక్క..

Yadadri devotees choked with presence of glass piece in pulihora prasadam

yadadri lakshmi narasimha swamy temple, yadadri temple, yadadri temple news, yadadri prasadam, Glass pieces in yadadri prasadam, Glass pieces in yadadri prasad, yadadri old narasimha swamy temple, yadadri patha laxmi narasimha swamy temple, Telangana Tirupati, Yadagiri gutta, Telangana

The preparation of the prasadam at Yadadri Lakshmi Narasimha Swamy, had to be carried out by the staff with utmost devotion, while the glass pieces in the prasadam appeared due to their negligence. It is difficult to imagine how dangerous it would be if devotees ate without seeing these pieces of glass .. or if the children melted.

యాదాద్రి పులిహోరా ప్రసాదంలో గాజుముక్క.. ఖంగుతిన్న భక్తులు

Posted: 03/07/2022 12:13 PM IST
Yadadri devotees choked with presence of glass piece in pulihora prasadam

తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావించి.. కళ్లకు అద్దుకుని మరీ తింటారు. కానీ.. ఈ  స్వామివారి ప్రసాదం తయారు చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం భక్తుల ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. ప్రసాదం తయారీని కూడా సిబ్బంది ఎంతో భక్తిప్రవత్తులతో నిర్వహించాల్సి వుండగా, వారు నిర్లక్ష్యం కారణంగా ప్రసాదంలో గాజుముక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ గాజుముక్కలను చూడకుండా భక్తులు తిన్నపక్షంలో.. లేదా చిన్నారులు అరగిస్తే ఎంతటి ప్రమాదమో ఊహించుకునేందుకే కష్టంగా ఉంది.

అయితే ఈ దారుణ అనుభూతిని పోందాడు ఓ భక్తుడు. అదృష్టవశాత్తు అతడు కొంత ప్రసాదాన్ని తీసుకుని నోట్లు వేసుకునే సమయంలో గాజు సీసం ముక్క కనిపించడంతో కలవరానికి గురయ్యాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు నిర్వహించే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రసాదం తయారీలో సిబ్బంది అజాగ్రత్త.. భక్తుల ప్రాణాల మీదకు వస్తోందనే విమర్శించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనే దీనికి నిదర్శనం. సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌కు చెందిన రఘు ఆదివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి క్షేత్ర సందర్శనకు వెళ్లారు.

బాలాయంలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తరువాత స్థానికంగానే ఉండే పాతగుట్ట ఆలయంలో నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి కౌంటర్లో ప్రసాదం కొనుగోలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కూర్చొని.. కుటుంబంతో సహా ప్రసాదం తింటుండగా.. పులిహోరలో గాజుముక్క కనిపించింది. వెంటనే అప్రమత్తమై తన పిల్లల వద్ద ఉన్న ప్రసాదాన్ని రఘు తీసుకున్నారు. ప్రసాదంలో సీసం ముక్కలు ఉన్నాయని.. తినొద్దని వారించారు. ప్రసాదాల తయారీలో అజాగ్రత్త భక్తుల ప్రాణాలను ప్రమాదాన్ని తెస్తుందని రఘు ఆరోపించారు. కాగా, ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ ఏఈవో శ్రవణకుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles