India’s Palestine Envoy found dead on office premises పాలస్తీనా భారత రాయభారి ముకుల్ ఆర్య అనుమానాస్పద మృతి

Mukul arya india s palestine envoy found dead at indian mission

Mukul Arya, Mukul Arya death, Mukul Arya dead, india palestine envoy death, india palestine envoy demise, Jaishankar, palestine india, palestine india news, India's Palestine Envoy, India, Palestinian city of Ramallah, Mukul Arya dies, suspicious death, National affairs

Mukul Arya, India's representative to Palestine, was found dead inside the Indian Mission in Ramallah. It was not immediately known how Arya, a 2008-batch Indian Foreign Service officer, died. Foreign Minister S Jaishankar has expressed shock over the death of the diplomat.

భారత రాయభారీ అనుమానాస్పద మృతి.. పాలస్తీనా ఎంబసీ కార్యాలయంలోనే..

Posted: 03/07/2022 11:34 AM IST
Mukul arya india s palestine envoy found dead at indian mission

పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాలస్తీనాలోని రమల్లా నగరంలో గల భారత రాయబార కార్యాలయంలో ఆయన విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదువుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కోల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలోనూ పనిచేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలోనూ పనిచేశారు.

ముకుల్ ఆర్య మృతి విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ధ్రువీకరించారు. ఆయన మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. నిత్య చురుకుగా, టాలెంతో వ్యవహరించే యువ అధికారిని కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముకుల్ మృతి వార్త తెలిసిన వెంటనే పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ భౌతిక కాయాన్ని తరలించేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles