Passenger falls between platform and moving train రైలు.. ఫ్లాట్ ఫామ్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తి.. అంతలో..

Passenger falls between platform and moving train pilot applies emergency brakes

passenger slipping between platform and moving train, passenger falls from moving train, Surat railway station, man saved after falling from train, moving train, Railway Minister, passenger, Surat railway station, emergency brake, Twitter video, Gujarat, viral video

The Ministry of Railways has shared a video on Twitter showing a passenger slipping between a platform and a moving train while alighting at the Surat railway station in Gujarat. The 13-second clip of the incident, which happened on February 28 showed people gathering to save the man. The train halted immediately and fortunately, the man stood up unhurt.

ITEMVIDEOS: నడుస్తున్న రైలు దిగిన వ్యక్తి.. ఫ్లాట్ ఫామ్ మధ్యలో చిక్కుకుని.. అంతలో..

Posted: 03/05/2022 06:44 PM IST
Passenger falls between platform and moving train pilot applies emergency brakes

రైలు ప్రయాణంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా.. ప్రమాదాలు మాత్రం సంభవిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా రైలు ఎక్కేట‌ప్పుడు.. దిగేట‌ప్పుడు తప్పకుండా రైలు ఆగిన తరువాతే దిగాలని రైల్వే యాజమాన్యం ప్రయాణికులకు సూచనలు చేస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. అనునిత్యం కొత్తప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి రైల్వే అధికారులు నిత్యం సూచనలు చేస్తూనే వుంటారు. ట్రయిన్ రన్నింగ్ లో ఉండగా మాత్రం రైలు ఎక్కడం కానీ, దిగడం కానీ చేయకూడదని పదే పదే చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ తమను కాద అన్నట్లు వ్యవహరించే కొందరు ప్రయాణికులు ప్రమాదపుటంచులకు చేరకుంటారు.

ప్యాసింజర్లు చేసే చిన్న త‌ప్పిదాల వ‌ల్ల ఎన్నో ప్ర‌మాదాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది క‌దులుతున్న రైలు ఎక్క‌బోతూ కింద‌ప‌డిపోతుంటారు. ప్లాట్‌ఫామ్, రైలు మ‌ధ్య‌లో ఇరుక్కుపోతుంటారు. కొంద‌రు ట్రాక్స్ మీద ప‌డిపోతుంటారు. ఇలా చాలా ర‌కాలుగా రైల్వే ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉంటాయి. తాజాగా గుజ‌రాత్‌లోని సూర‌త్ రైల్వే స్టేష‌న్‌లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సూర‌త్ స్టేష‌న్ నుంచి ఓ ట్రెయిన్ బ‌య‌లుదేరింది. నెమ్మ‌దిగా స్పీడ్ పెరుగుతోంది. ఇంత‌లో ఓ ప్యాసెంజ‌ర్.. ట్రెయిన్ నుంచి దిగ‌బోయాడు. జారి కింద‌ప‌డ్డాడు. ప్లాట్‌ఫామ్, రైలు మ‌ధ్య‌లో ప‌డిపోయాడు.

దీంతో ప్ర‌యాణికులంతా గ‌ట్టిగా అరిచేస‌రికి… వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ట్రెయిన్ డ్రైవ‌ర్(రైల్వే గార్డ్‌) వెంట‌నే ఎమ‌ర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. రైలు ఆగ‌గానే.. ఆ ప్ర‌యాణికుడు ప్లాట్‌ఫామ్ నుంచి పైకి లేచాడు. మరణాన్ని వెంటుకవాసిలో తప్పించుకుని తనకేమీ జరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ భయానక వీడియోను చూసిన నెటిజనులు మాత్రం రైలు ఆగిన తరువాత దిగితే.. ఇంతటి ప్రమాదంలో పడాల్సిన పనిలేదు కదా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అతని అదృష్టం కోద్దీ ఎటువంటి గాయాలు కాకుండా బ‌య‌ట‌ప‌డ‌టంతో అక్క‌డివారంతా ట్రెయిన్ డ్రైవ‌ర్‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles