WhatsApp group admin not liable for objectionable post వాట్సాప్‌ అభ్యంతరకర సందేశాలపై బాధ్యత ఉండదు:కొర్టు

Whatsapp admin not liable for posting of objectionable content by a member kerala hc

Kerala High Court, Whatsapp, Justice Kauser Edappagath, chargesheet, WhatsApp group, POCSO Act, IT Act, Kerala, Kerala Legal news, Kerala latest news, kerala crime news, crime

The Kerala High Court on said admins of WhatsApp groups are not liable for objectionable posts made by group members. The Bench of Justice Kauser Edappagath quashed a chargesheet filed against an admin of a WhatsApp group, who has been arraigned as an accused in a case registered under relevant sections of POCSO Act and IT Act.

వాట్సాప్‌ అడ్మిన్లకు ఊరటనిచ్చిన కోర్టు.. అభ్యంతరకర సందేశాలపై బాధ్యత ఉండదు

Posted: 02/24/2022 05:15 PM IST
Whatsapp admin not liable for posting of objectionable content by a member kerala hc

మీరు ఏదైనా వాట్సాప్‌ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నారా?.. అయితే, ఇది మీకు పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఆయా గ్రూప్‌లో వచ్చే అభ్యంతరకర సందేశాలపై గ్రూప్‌ అడ్మిన్లకు ఎలాంటి బాధ్యత ఉండదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. వాట్సాప్‌ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్‌ పోస్టులపై గ్రూపు అ‍డ్మిన్‌ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్‌ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్‌ ఎడప్పగత్‌ తన తీర్పును వెలువరించారు. గతంలో దాఖలైన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్‌ ‘ఫ్రెండ్స్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు. దీనికి అతనితో పాటు మరో ఇద్దరు అ‍డ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో పిల్లలు లైంగిక చర్యలకు పాల్పడినట్లు చూపే వీడియోను షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ఉండడంతో పిటిషనర్‌ను సైతం నిందితుడిగా చేర్చడంతో పిటిషనర్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.

వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్‌కు, ఇతర గ్రూప్‌ సభ్యులపై ఉన్న ఏకైక ప్రత్యేక హక్కు.. గ్రూప్‌లో ఎవరైనా జాయిన్‌ చేయొచ్చని, లేదంటే తొలగించవచ్చని కోర్టు విచారణ సందర్భంగా పేర్కొన్నది. వాట్సాప్‌ గ్రూప్‌లోని సభ్యుడికి గ్రూప్‌లో పోస్ట్‌ చేసిన వాటిపై నియంత్రణ ఉండదని.. నియంత్రించలేరని, సెన్సార్స్‌ చేయలేరని పేర్కొంది. ఒక చట్టం నిర్దేశిస్తేనే క్రిమినల్ చట్టంలో వికారియస్ లయబిలిటీని నిర్ణయించవచ్చని, ప్రస్తుతం ఐటీ చట్టంలో అలాంటిదేమీ లేదని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ పేర్కొన్నారు. ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ అడ్మిన్ మధ్యవర్తిగా ఉండలేడని న్యాయమూర్తి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles