Opportunity for darshan of Ugranarasimha Swamy after four years నాలుగేళ్లకు తెరుచుకున్న ఉగ్రనరసింహస్వామి ద్వారాలు..

Devotees receiving the darshan of ugra narasimha temple after four years

Ugranarasimha Swamy, historic Zarani Cave Temple, devotees in zarani cave temple after four years, ugra narasimha Devotees, Ugra Narasimha Swamy Darshan, 300 meters of chest water, darshan of God, rise in water level in cave, oxygen problem, Telangana, Maharashtra, Karnataka, Devotional

The Ugranarasimha Swamy (ugra narasimha) of the historic Zarani Cave Temple in the district has been given a chance from today. Devotees are given the opportunity to perform Ugarnarasimha's Darshan after four years. 200 meters of chest water is allowed to enter the darshan of God

నాలుగేళ్లకు తెరుచుకున్న ఉగ్రనరసింహస్వామి ద్వారాలు.. భక్తుల కిటకిట..

Posted: 02/18/2022 04:34 PM IST
Devotees receiving the darshan of ugra narasimha temple after four years

హిందువలు తమ కష్టనష్టాలను దూరం చేసి.. ఎలాంటి పీడలు, బాధలు, భయాలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవించేలా అభయాన్ని అందించే లక్ష్మీనరసింహ స్వామి గురించి తెలుసు. అయితే ఇప్పటి భక్తులకు ఈ పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ వున్నాయో.. వాటి విశిష్టతలు ఏంటో చాలా వరకు తెలియదు. తమ నిత్య జీవితంలోని ఉరుకులు, పరుగులతోనే వారు బిజీగా మారుతున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లను పక్కనబెడితే.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చేరువలో మత్స్యనరసింహ స్వామి దేవాలయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కొండపైన కొలనులో చేపలకు తిరునామాలు ఉండటం అత్యంత విచిత్రమైన విషయం.

ఇక ఇలానే కర్ణాటకలోనూ మరో నరసింహ స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఆలయంలోని మూలవిరాట్ ను దర్శనం చేసుకోవాలంటే.. తప్పకుండా 300 మీటర్ల దూరం పాటు నీళ్లలో నడవాల్సి ఉంటుంది. నీళ్లలో నడవడం అంటే ఏదో మోకాళ్ల లోతు అనుకుంటే పోరబాటే. మనిషి ఛాతి వరకు ఉండే నీళ్లులో 300 మీటర్ల దూరం నడిచి అక్కడ కొలువైన ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్​ సమీపంలోని మణిచోళ పర్వత శ్రేణుల్లోని గుహలో ఉన్న ఈ సుప్రసిద్ద నరసింహస్వామి ఆలయం దాదాపుగా నాలుగేళ్ల తరువాత ద్వారాలు తెరచుకుంది. సుమారు 400 ఏళ్ల ఆలయ చరిత్రలో తొలిసారి ఆలయంలోనికి భక్తులను అనుమతిని రద్దు చేశారు.

నాలుగేళ్లకు ముందు ఈ ఆలయంలోని గృహలో నీళ్లు పూర్తి మట్టాలనికి చేరుకుని ప్రవహించడంతో ఆలయాన్ని మూసివేశారు. దీంతో పాటు నిండా నీళ్లు రావడంతో లోనికి వెళ్లిన భక్తులు జీవవాయుకు కూడా అందక ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఇక గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ ఆలయంలోనికి భక్తులకు అనుమతి నిరాకరించారు. కాగా నాలుగేళ్ల తరువాత మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ద్వారాలు భక్తుల సందర్శనార్థం తెరచుకున్నాయి. బీదర్ నగరం నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచోళ కొండ శ్రేణి క్రింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. నీరు ఎల్లప్పుడూ ఈ సొరంగం గుండా ప్రవహిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles