"Unruly" Passenger Escorted Off Flight ప్రయాణికుడి వీరంగం.. విమానం అమాంతం కిందపడుతుందని హంగామా.!

A flight was diverted after a passenger tried to open the plane door

American Airlines, unruly passenger, Los Angeles man, Juan Rivas, Flight Diverted, AA 1775, Unruly air passengers, Washington-bound flight, flight attendant, coffee pot, Kansas City, law enforcement, America, US, Crime

A Los Angeles man is being charged with interference with flight crew members and attendants after he allegedly caused a disturbance midair, causing a Washington, D.C.-bound flight from Los Angeles to land in Kansas City. The man, Juan Rivas, was subdued by both passengers and crew members, including a flight attendant who stopped him from opening the passenger door by hitting him in the head with a coffee pot, according to the affidavit.

ITEMVIDEOS: ప్రయాణికుడి వీరంగం.. విమానం అమాంతం కిందపడుతుందని హంగామా.!

Posted: 02/17/2022 04:49 PM IST
A flight was diverted after a passenger tried to open the plane door

విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన రభస అంతా ఇంతా కాదు. విమానం అమాంతం కిందకు పడిపోతోందని హైరానా చెందిన ప్రయాణికుడు.. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు. తాను కిందకు దిగిపోతానని నానా యాగీ చేశారు. దీంతో వాషింగ్టన్ డిసికి వెళ్లాల్సిన విమానాన్ని పైలెట్లు దారిమళ్లించి కన్సాస్ సిటి విమానాశ్రయాంలో ల్యాండ్ అయ్యేలా చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించాడు. పైలట్లుండే కాక్ పిట్ లోకి వెళ్లేందుకు గొడవ గొడవ చేశాడు. విమానం ప్రధాన డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు.

దీంతో ఫ్లైట్ అటెండెంట్ కు చిర్రెత్తుకొచ్చి టీ పాట్ తో అతడి తల పగులగొట్టింది. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. రక్తం ధారగా కారింది. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి వాషింగ్టన్ కు బయల్దేరిన విమానంలో జరిగింది. హంగామా సృష్టించిన వ్యక్తికి గాయం కావడంతో విమానంలోనే కట్టుకట్టి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వాషింగ్టన్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి కాన్సాస్ లో దించారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారమివ్వడంతో వాళ్లు హంగామా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని జువాన్ రెంబర్టో రివాస్ (50)గా గుర్తించారు.

ఘటనకు సంబంధించిన వీడియోను మ్యూజ్ ముస్తఫా అనే ఓ ప్రయాణికుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఘటనపై అమెరికా న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫ్లైట్ అటెండెంట్ల దగ్గర నుంచి వైన్ బాటిల్ తీసుకున్న రివాస్.. దానిని పగులగొట్టి బెదిరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. సర్వీస్ కార్ట్ ను తన్నుతూ హంగామా సృష్టించాడని తెలిపింది. విమానం ఎగ్జిట్ డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడని, ఓపిక నశించిన ఫ్లైట్ అటెండెంట్ టీ పాట్ తో రెండు సార్లు అతడి తలపై కొట్టిందని చెప్పింది. అతడిని ఆపేందుకు ప్రయాణికులూ ప్రయత్నించినా కంట్రోల్ కాలేదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles