Lalu Prasad Yadav convicted in fodder scam case దొరండా దాణా కేసులోనూ లాలూ దోషే.! 21న శిక్ష ఖరారు..

Lalu prasad yadav convicted in 5th fodder scam case

Doranda treasury, Judge CK Shashi, special CBI court, fodder scam case, RJD chief, Lalu prasad yadav, ranchi court, Jharkhand, Bihar, Politics, Crime

Bihar Former Chief Minister Lalu Prasad Yadav has been found guilty of illegal withdrawals of ₹ 139.35 crore from the Doranda treasury by a special CBI court in Jharkhand's Ranchi. RJD chief has now been convicted in all five fodder scam cases in which he was named as a conspirator - was present in the courtroom as Judge CK Shashi read out verdict.

దొరండా దాణా కేసులోనూ లాలూ దోషే.! 21న శిక్ష ఖరారు..

Posted: 02/15/2022 05:42 PM IST
Lalu prasad yadav convicted in 5th fodder scam case

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను దాణా కుంభకోణం కేసు ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ కేసులో ఇప్పటికే శిక్షను అనుభవించిన ఆయనకు తాజాగా ఈ కేసులో మరో కోర్టు కూడా ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు మరోమారు శిక్ష పడటం నిశ్చితమైంది. దొరండా ట్రెజ‌రీ నుంచి అక్ర‌మ‌ంగా నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్ర‌త్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువ‌రించింది. జ‌డ్జి సీకే శ‌శి ఆదేశాల మేర‌కు లాలూ ప్ర‌సాద్ ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజ‌ర‌య్యారు. లాలూతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మ‌రో 98 మందిని కూడా వ్యక్తిగతంగా హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించింది.

1996లో తొలిసారి దొరండా ట్రెజ‌రీ కేసు న‌మోదు అయ్యింది. ఆ స‌మ‌యంలో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో సంబంధం కలిగిన 55 మంది ఇప్ప‌టికే మ‌ర‌ణించారు. దాణా కుంభ‌కోణంలో దొరండా ట్రెజ‌రీ కేసులో అయిద‌వ‌ది. ఈ కేసులో 24 మందిని నిర్ధోషులుగా పేర్కోన్న న్యాయస్థానం.. 35 మందిని దోషులుగా పేర్కోంది. వీరిలో అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ దృవ్ భగత్ కూడా వున్నారు. కాగా తాజాగా న్యాయస్థానం విధించిన శిక్ష నేపథ్యంలో వీరు బెయిల్ పిటీషన్ దాఖలు చేసేందుకు అర్హత సంపాదించారు. మొత్తం 950 కోట్ల దాణా కుంభ‌కోణంలో దొరండాకు సంబంధించి లాలూ సహా దోషులందరూ కలసి ఏకంగా రూ.139 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.

దీంతో న్యాయస్థానం ఈ కేసులో నిందితులందరినీ దోషులుగా నిర్థారించింది. వారిపై మోపబడిన అభియోగాలు.. న్యాయవిచారణలో నిజమని తేలింది. లాలూ ప్ర‌సాద్ ప్ర‌భుత్వం ప‌శువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసిన‌ట్లు కేసులు న‌మోదు అయ్యాయి. దాణా కుంభ‌కోణం కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష ప‌డ‌గా.. లాలూ ఇప్ప‌టి వ‌ర‌కు 3.5 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. దొరండా ట్రెజ‌రీ కేసులో ఆయనకు మూడేళ్లకు మించి శిక్ష పడితే మళ్లీ జైలు జీవితాన్ని ఆయన గడపాల్సి వస్తుంది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలు శిక్ష ప‌డింది. లాలూ ప్ర‌సాద్‌ యాదవ్ సహా మరికొందరికి ఈ నెల 21న న్యాయస్థానం శిక్షను ప్రకటించనుందని డిఫెన్స్ లాయ‌ర్ సంజ‌య్ కుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles