Police filed case against youtuber sarayu roy సరయుపై కేసు నమోదు.. బంజారాహిల్స్ కు బదలాయింపు

Police filed case against youtuber sarayu roy based on vhp complaint

Vishwa Hindu Parishad, Rajanna siricilla district VHP Leader, VHP complaint against Sarayu roy, VHP complaint against Sarayu 7Arts, Telugu youtuber, big boss fame sarayu, vhp, sarayu roy, bigg boss 5 telugu contestant, bigg boss, banjara hills, 7 arts sarayu roy, 7 arts sarayu, Banjara hills police, Hyderabad, Telangana, crime

Rajanna siricilla district Police filed a case against youtuber and big boss telugu contestant sarayu roy and her 7 arts team based on a complaint lodged by vishwa hindu parishad and transferred it to banjara hills police station.

బిగ్ బాస్ ఫేం సరయుపై కేసు నమోదు.. బంజారాహిల్స్ కు బదలాయింపు

Posted: 02/07/2022 11:20 AM IST
Police filed case against youtuber sarayu roy based on vhp complaint

యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫేం సరయు రాయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె రూపొందించిన ఓ లఘు చిత్రం ఓ వర్గం మనోభావాలను గాయపర్చేలా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉందంటూ పిర్యాదు రావడంతో పోలీసులు అమెపై కేసు నమోదు చేశారు. అమెతో పాటు అమె బృందంపై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సరయు, ఆమె బృందం ఇటీవల రూపోందించిన ఓ లఘు చిత్రం హిందూవుల మనోభావాలను గాయపర్చేలా వున్నాయని దాంతో పాటు మహిళలను కూడా కించపర్చేలా వున్నాయని పిర్యాదు నమోదైంది.

ఈ మేరకు సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేయగా, ఆ వీడియోను హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చిత్రీకరించినట్టు తేలింది. దీంతో కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ‘7ఆర్ట్స్’ పేరుతో సరయు, ఆమె బృందం ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం వీరు ఒక లఘు చిత్రాన్ని రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన చానల్‌తోపాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ లఘు చిత్రం విమర్శలను ఎదుర్కోడంతో పాటు హిందువుల మనోభావాలను గాయపర్చేలా ఉందని పిర్యాదు వచ్చింది.

మహిళలను కూడా అగౌరవంగా చిత్రీకరించడంతో పాటు కించపర్చేలా రూపోందించారని వీహెచ్ పీ నేత పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు బదలాయించారు. ఇందులో సరయు, ఆమె బృందం తలకు ‘గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న బ్యాండు ధరించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని, అంతేకాకుండా మద్యం తాగి హోటల్‌కు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles